జార్జ్ క్రిష్’ మూవీ ఫస్ట్ బూస్టర్ రిలీజ్

- Advertisement -

జార్జ్ క్రిష్’ మూవీ ఫస్ట్ బూస్టర్ రిలీజ్
‘George Reddy’ Movie First Booster Released
వరుసగా రెండు హిట్లు కొట్టిన చార్మింగ్ స్టార్ శర్వా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’తో హ్యాట్రిక్ హిట్ పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏటీవీ సమర్పిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వినోదాత్మక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వా సరసన మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్‌ను విడుదల చేశారు. శ్రీను వైట్ల సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే హ్యూమర్, ఫన్ ఈ బూస్టర్‌లో పుష్కలంగా కనిపించింది. ఇందులో శర్వానంద్‌ను రెండు విభిన్న మతాలకు చెందిన పాత్రల్లో పరిచయం చేశారు. క్రిస్టియన్‌గా జార్జ్, హిందువుగా క్రిష్ పాత్రల్లో శర్వా అలరించారు. పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో ఈ రెండు పాత్రలను చూపిస్తూ క్యూరియాసిటీ పెంచారు.
రెండు పాత్రల్లోనూ శర్వానంద్ భక్తిలో పూర్తిగా లీనమై కనిపిస్తున్నారు. ఆధ్యాత్మిక భావోద్వేగంతో కనిపించే శర్వా.. తన కామిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వులు పూయించారు. రెండు పాత్రల చుట్టూ ఉన్న విభిన్న పరిస్థితులు ఏంటి? అనే ఆసక్తిని క్రియేట్ చేస్తూనే.. సినిమాలోని యూనిక్ హ్యూమర్‌కు ఫస్ట్ బూస్టర్ ఒక గ్లింప్స్ ఇచ్చింది.
ఈసారి శ్రీను వైట్ల కొత్త బ్యాక్‌డ్రాప్, డిఫరెంట్ కథాంశాన్ని ఎంచుకుని,  ఆయన సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం లక్ష్యంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు బూస్టర్ చూస్తే అర్థమవుతోంది.
శర్వానంద్ ఇందులో డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నారు. ఆయన స్టైలిష్ కార్పొరేట్ లుక్ ఆకట్టుకుంటోంది. చార్మింగ్ స్టార్ ఇమేజ్‌కు ఈ లుక్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. హీరోయిన్ మానస వారణాసి కూడా గ్లామరస్‌గా కనిపించారు. లీడ్ పెయిర్ మధ్య ఉండే కాంటెంపరరీ లవ్ ట్రాక్‌కి సంబంధించిన   గ్లింప్స్‌ను కూడా ఫస్ట్ బూస్టర్‌లో చూపించారు.
అనూప్ రూబెన్స్ ఎనర్జిటిక్, లైవ్లీ మ్యూజికల్ స్కోర్‌తో ఫస్ట్ బూస్టర్‌కు మరింత జోష్ తీసుకొచ్చారు. కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. నందు సవిరిగాన, గోపీ మోహన్ రచయితలుగా వ్యవహరిస్తుండగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.
‘జార్జ్ క్రిష్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. . ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు హ్యూమర్, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన కలర్‌ఫుల్ ఫీస్ట్ అందించేందుకు ‘జార్జ్ క్రిష్’ సిద్ధమౌతోంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, మానస వారణాసి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular