Friday, December 27, 2024

నవంబర్‌లో 5 రాష్ట్రాల ఎన్నికలు..  డిసెంబర్ తొలి వారంలో ఫలితాలు!

- Advertisement -

దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) ఈ ఏడాది నవంబర్ లో జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం, రాజస్థాన్(Rajasthan)లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కొనసాగే ఛాన్స్ ఉందని ఎన్నికల సంఘం(Election Commission) వర్గాలు తెలిపాయి. ఆ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8 – 10 మధ్యలో ప్రకటించే అవకాశం ఉంది. 2018లో వీటికి చివరి సారిగా ఎన్నికలు జరిగాయి. సరిగ్గా 5 ఏళ్ల తరువాత 2023 ఏడాది చివర్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆపద్ధర్మంగా మారనున్నాయి. రాజస్థాన్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్ లకు ఒకే సారి పోలింగ్ నిర్వహించి, ఛత్తీస్ గఢ్(Chattisgarh) కి రెండు విడతల్లో పోలింగ్ జరపనున్నట్లు సమాచారం. తెలంగాణ(Telangana), రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో ముగుస్తుంది. మిజోరాం(Mizoram) శాసన సభ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 17తో ముగుస్తుంది.

5-state-elections-in-november-results-in-first-week-of-december
5-state-elections-in-november-results-in-first-week-of-december

అధికారంలో ఉన్న పార్టీలు ఇవే..

ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వాలు అధికారంలో ఉండగా.. మిజోరంలో బీజేపీ(BJP) మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉంది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి నేతృత్వంలోని కేసీఆర్ సర్కార్, మధ్యప్రదేశ్(Madyapradesh) లో బీజేపీ సర్కార్ రూలింగ్ లో ఉన్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందు ఆయా ప్రాంతాల్లో ఎన్నికల సన్నద్ధతను ఈసీ పరిశీలించింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు శుక్రవారం పరిశీలకుల బృందం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికలను 2024 లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పట్టునిలుపుకోవాలని రెండు పార్టీలు చూస్తుండగా.. ప్రతిపక్షంగా ఉన్న ప్రాంతాల్లో అధికారంలోకి రావాలని ఉవ్విలూరుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ తన ఫోకస్ మొత్తం ఈ ఎన్నికలపై ఉంచింది. ఇప్పటికే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఆయా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తుండగా.. బీజేపీ సైతం స్పీడ్ పెంచింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తదితర సీనియర్ నేతలు వరుసపెట్టి సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్