ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ సభలు బ్రహ్మాండంగా విజయవంతమయ్యాయి:ఎంపీ రవిచంద్ర
ఈ సభలు దిగ్విజయం కావడానికి తోడ్పాటునందించిన, తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు:ఎంపీ రవిచంద్ర
ఈనెల 5వ తేదీన జరిగే కొత్తగూడెం,ఖమ్మంలలో సభలకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఉమ్మడి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి:ఎంపీ రవిచంద్ర
పదికి పది సీట్లు బీఆర్ఎస్ అఖండ ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం:ఎంపీ రవిచంద్ర
ఎంపీ రవిచంద్ర ఖమ్మం తెలంగాణ భవన్ లో మంత్రి అజయ్ కుమార్, ఎమ్మెల్సీ మధు, ఎమ్మెల్యే వెంకటవీరయ్య తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలేరు, సత్తుపల్లి,ఇల్లందులలో ఇప్పటివరకు జరిగిన “ప్రజా ఆశీర్వాద సభ”లు బ్రహ్మాండంగా విజయవంతం కావడానికి తోడ్పాటునందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు,ప్రజలు, మీడియా మిత్రులకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధన్యవాదాలు తెలిపారు.ఎంపీ రవిచంద్ర గురువారం ఖమ్మం తెలంగాణ భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే వెంకటవీరయ్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు”ప్రజా ఆశీర్వాద సభ”లకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని, స్వచ్చంధంగా తరలివచ్చి దిగ్విజయం చేస్తున్నారని చెప్పారు.ఈ సభల మాదిరిగానే ఈనెల 5వ తేదీన కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కేంద్రాలలో జరిగే సభలకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.మహానేత కేసీఆర్ సభలకు ప్రజల నుంచి వ్యక్తమవుతున్న స్పందన చూస్తుంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని పదికి పది సీట్లను బీఆర్ఎస్ అఖండ ఓట్ల మెజారిటీతో గెల్చుకోవడం ఖాయమైందని ఎంపీ వద్దిరాజు ధీమాగా చెప్పారు.ఈ సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గం ఎన్నికల సమన్వయకర్త గుండాల కృష్ణ (ఆర్జేసీ), తెలంగాణ ఉద్యమకారులు జహీరలీ,ఉప్పల వెంకటరమణ, గుండ్లపల్లి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.