- Advertisement -
కొలిమిగుండ్ల మండలంలో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..
Minister BC Janardhan Reddy visited Kolimigundla mandal.కొలిమిగుండ్ల,
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లోని కొలిమిగుండ్ల మండలంలో ఉన్న బందర్ల పల్లె చెక్పోస్ట్ వద్ద మైనింగ్ అధికారులు నాపరాలపై విధించిన కన్సీడరేషన్ రుసుమును తొలగించాలని గత ఐదు రోజుల నుండి గనుల యజమానులు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విషయం తెలుసుకున్న రోడ్ల భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దీక్ష సభకు చేరుకొని దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వారికి మద్దతు తెలిపారు. గనుల యజమానుల సమస్యలను మైనింగ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా మాట్లాడతానని వారికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డి, మూలే హుస్సేన్ రెడ్డి, నంద్యాల రామేశ్వర్ రెడ్డి, వి ఆర్ లక్ష్మీరెడ్డి, సర్పంచ్ శివశంకర్, ఉగ్రసేనారెడ్డి, తోట నాగమల్లారెడ్డి, తోట అమర్నాథ్ రెడ్డి, గొంగటి హుస్సేన్ రెడ్డి, నారాయణరెడ్డి, కోటపాడు శివరామిరెడ్డి, జయలక్ష్మి రెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, పల్లె వెంకటేశ్వర్ రెడ్డి, లోకనాథ్ రెడ్డి, కృష్ణ రంగారెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇంకా నాయకులు కార్యకర్తలు గనుల యజమానులు పాల్గొన్నారు.
- Advertisement -




