తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సీఎం విజయన్‌ను చంపేస్తానని బుధవారం సాయంత్రం రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ఫోన్ చేసింది మైనర్ బాలుడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోలీసులు మాత్రం ఈ ఫోన్ కాల్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
కొద్దిరోజుల క్రితం కేరళలోని కలమస్సేరిలో ఓ ప్రార్థనా సమావేశంలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 52 మంది గాయపడ్డారు. బాంబు పేలుళ్లకు తానే బాధ్యుడినని పేర్కొంటూ త్రిశూర్‌కు చెందిన డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ క్రమంలో సీఎంకు బెదిరింపులు రావడంతో పోలీసుశాఖ ఉలిక్కిపడింది. గతంలో కూడా పలుమార్లు విజయన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు బెదిరింపు ఫోన్ కాల్
- Advertisement -
- Advertisement -