ముఖ్యమంత్రి కేసీఆరే 119 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థి:ఎంపీ రవిచంద్ర
రాష్ట్రాన్ని సాధించిన,నంబర్ వన్ గా తీర్చిదిద్దిన కేసీఆర్ ని చూసి ఓటేయ్యండి: తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చిన ఎంపీ రవిచంద్ర
కేసీఆర్ ని కాదని ఇతర పార్టీలకు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, తీవ్రంగా నష్టపోతం:ఎంపీ రవిచంద్ర
కొత్తగూడెం తెలంగాణ భవన్ లో గురువారం సాయంత్రం జరిగిన ఉద్యమకారుల సమావేశానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 119అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నది బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావేనని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.కేసీఆర్ మహోద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించి పెట్టడమే కాక దేశం మొత్తం మీద నంబర్ వన్ తీర్చిదిద్దారని,అన్ని స్థానాలలో కూడ ఆయనే పోటీలో ఉన్నట్లు భావించి కారు గుర్తుకే ఓటేసి బీఆర్ఎస్ కు అఖండ విజయం చేకూర్చాలని ఎంపీ రవిచంద్ర పిలుపునిచ్చారు.కొత్తగూడెం తెలంగాణ భవన్ లో గురువారం సాయంత్రం జరిగిన ఉద్యమకారుల సమావేశానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.చిన్నచిన్న పొరపొచ్చాలు, అభిప్రాయబేధాలను మర్చిపోయి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి,అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ కు కొండంత అండగా నిలవాలని ఉద్యమకారులను ఆయన కోరారు.
బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను కాదని పొరపాటున ఇతర పార్టీలకు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని,గోసపడ్తామని ఎంపీ రవిచంద్ర విడమర్చి చెప్పారు.తనకు కులమత బేధాలు ఏ మాత్రం లేవని,సమయం వచ్చినప్పుడు ఉద్యమకారుల ఇళ్లకు వస్తానని,అందరితో కలిసి భోజనం చేస్తానని,అండగా ఉంటానన్నారు.ఈనెల ఐదున జరిగే బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”ను విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని,ఐదారుగురిని సీఎం వద్దకు తీసుకెళతానని హామీనిచ్చారు.కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని,ఆసక్తి ఉన్న వారికి రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తానని ఎంపీ వద్దిరాజు భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి”,”జోహార్లు జోహార్లు తెలంగాణ అమరవీరులకు జోహార్లు”,”జై సింగరేణి జైజై సింగరేణి”,”కారు గుర్తుకే మన ఓటు” అనే నినాదాలు మిన్నంటాయి.సమావేశంలో తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.ఈ సమావేశంలో బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తలు సర్థార్ పుటం పురుషోత్తం, బత్తినీడి ఆది విష్ణుమూర్తి, జెన్నాయికోడే జగన్మోహన్, ఉద్యమకారులు మోరే భాస్కర్ రావు,తొగరు రాజశేఖర్,బండి రాజుగౌడ్,యాకయ్య, అనుదీప్, చంద్రశేఖర్(చందూ),మల్లెల ఉషారాణి,లగడపాటి రమేష్, హుస్సేన్ (సోని), రాజేంద్రప్రసాద్, ఇమ్రాన్,గుంపుల మహేష్,ఐలయ్య, యూసఫ్,లిక్కి చంద్రశేఖర్,దారా రాజేందర్,ఎంపీ రవిచంద్ర అనుచరులు బాపట్ల మురళి, జెన్నాయికోడే జగన్మోహన్,భానుప్రతాప్,ఆకుల సాయి, జెన్నాయికోడే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.