ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఖండించిన టీటీడీపీ నేత అర్వింద్ కుమార్ గౌడ్
హైదరాబాద్ నవంబర్ 2: తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వేలు పెడుతున్నారంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీటీడీపీ సీనియర్ నేత అర్వింద్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు ఎన్టీఆర్ జపం చేయటం లేదా? అని ప్రశ్నించారు. బీసీ వర్గాలను ప్రోత్సహించిన టీడీపీపై ఈటల కామెంట్స్ శోచనీయమన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ సహా కాంగ్రెస్ నేతలు.. చంద్రబాబు జపం చేస్తున్నారని తెలిపారు. ఓట్ల కోసం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని మొదట ప్రకటించిందే టీడీపీ అని చెప్పుకొచ్చారు. కొన్ని ప్రత్యేక కారణాల వలనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నామని తెలిపారు. చంద్రబాబు సమయం ఇవ్వలేరన్న కారణంగానే పోటీకి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. సేవాభావంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం అని అర్వింద్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు



