ఎమ్మెల్యే పైళ్లకు చుక్కలు చూపిస్తున్న త్రిబుల్ ఆర్ బాధితులు

- Advertisement -

భువనగిరి: ఎన్నికల వేళ, .భువనగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి పైళ్ళ శేఖర్ రెడ్డి కుటుంబీకులకు అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. మొన్న రాయగిరి లో శేఖర్ రెడ్డి కూతురు మాన్వితను ప్రచారం చేయకుండా అడ్డుకోగా..నిన్న బాలంపల్లి గ్రామంలో శేఖర్ రెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఆయన భార్య, మామను అడ్డుకున్నారు.  త్రిబుల్ ఆర్ భాదిత రైతులు. తమ పొట్ట కొట్టింది కాక….ఇంకా ఏ మొహం పెట్టుకుని వచ్చారంటూ గట్టిగా నిలదీస్తున్నారు. కాగా  రియల్ ఎస్టేట్ బిజినెస్ వృద్ది కోసం త్రిబుల్ ఆర్ డిజైన్ మార్చారని చాలా కాలంగా ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిపై ఆగ్రహం తో ఉన్నారు.  త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోయిన రైతులు.ఎన్నికల సమయం కావడంతో ఇప్పుడు శేఖర్ రెడ్డికి చుక్కలు చూపెడుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular