గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళించండి
శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ ఈవోను కలిసిన రైతు సంక్షేమ సేవా సంఘం
హైదరాబాద్: గోశాలలో ఉన్న గోవులకు విముక్తి కలిగించాలని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ ఈవో కృష్ణ ప్రసాద్ ను హైదరాబద్ లోని దేవాదాయ శాఖా కార్యాలయం లో కలిసిన వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా రైతు సంక్షేమ సంఘం ఆర్గనైజేషన్ నడిపిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం రైతు సేవా సంఘం గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను తమ సంఘం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గోశాలలో ఉన్నటువంటి గోవులకు విముక్తి కలిగిస్తున్నట్లయితే ఆవు మూత్రం పేడ జీవామృతం ద్వారా భూమి సారావంతమై అందులో పండించిన పంట తిన్నవాళ్లు ఆరోగ్యవంతులవుతారన్నారు. రైతును ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తూ రైతు సేవా సంక్షేమం సంఘం ద్వారా రైతులకు ఫ్రీగా గోవులను అందిస్తూ రైతు సంక్షేమ సంఘం ఆర్గనైజేషన్ నడిపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో సంఘం ముఖ్య సలహా దారులు మహేశుని లక్ష్మయ్య , జనరల్ సెక్రెటరీ ఏళ్ల ఉపేందర్ రెడ్డి లీగల్ అడ్వైజర్ దొంతినేని శ్రీనివాస్ రావు , శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ ఈవో కృష్ణ ప్రసాద్ ను కలిసి గోశాలలో ఉన్నటువంటి ఆవులకు విముక్తి కల్పించమని కోరినట్లు తెలిపారుబాల్గురి ఆంజనేయులు మల్లారెడ్డి B సిద్దయ్య గౌడ్ N. భరత్, విశ్వానాథ్ తదితరులు పాల్గొన్నారు.



