
కిషన్ రెడ్డికి కాలేరు సవాల్
హైదరాబాద్: అంబర్పేట అభివృద్ధిపై వీలైతే కిషన్ రెడ్డి చర్చకు సిద్ధంగా ఉన్నారా అని అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సవాల్ విసిరారు. నియోజకవర్గంలోని చే నెంబర్ చౌరస్తా, మహంకాళి టెంపుల్, నింబోలి అడ్డా మహంకాళి టెంపుల్ ఎక్కడైనా సరే చర్చిద్దాం అని చెప్పారు. ప్రచారంలో భాగంగా ఈరోజు బాగ్ అంబర్ పేట లోని బతుకమ్మకుంట, నందనవనం, శారద నగర్ తదితర కాలనీలలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తాను చేసిన అభివృద్ధి పనులను వివరించి ఓటు అడిగారు. నందనవనం కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఓటర్లు ఎక్కడకు వెళ్లిన పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్నారని అభివృద్ధిని చూసి ఓటు వేస్తామని చెప్పారని ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు.



