ఇంకో రెండు దీపావళిలు ఉన్నాయి: అమిత్ షా

- Advertisement -

కరీంనగర్, నవంబర్ 20, (వాయిస్ టుడే): తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 3న మరోసారి దీపావళి జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రారంభం అయ్యే సమయంలో మూడోసారి దీపావళి వస్తుందని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు అమిత్ షా హాజరై మాట్లాడారు. అంతకుముందు జనగామ జిల్లా కేంద్రంలో కూడా అమిత్ షా మాట్లాడారు. స్థానిక ప్రెస్టన్ మైదానంలో జరిగిన సభలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడుతూ.. అసదుద్దీన్ ఓవైసీ, ఇతర నాయకులకు భయపడి కేసీఆర్ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని విస్మరించారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి చూపిస్తామని చెప్పారు. బైరాన్ పల్లిలో రజాకార్ల చేతిలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. అక్కడ అమరుల కోసం స్మారక స్థూపాన్ని నిర్మిస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ జనగామకు ఇచ్చిన పాలిటెక్నిక్ కాలేజీ హామీ నెరవేరనేలేదని అన్నారు. అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి భూ కబ్జాలకు పాల్పడే వాళ్లేనని అమిత్ షా విమర్శించారు.

there-are-two-more-diwalis
there-are-two-more-diwalis

కుటుంబ పార్టీలకు నూకలు చెల్లు

తెలంగాణలో ఎన్నికల వేడి అగ్నిరాజేస్తోంది. ప్రతి పార్టీ తమ ప్రచారంలో మంచి కాకమీద ఉంది. ఇందులో భాగంగా బీజేపీ తన ప్రచారంలో వేగం పెంచి కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతోంది. ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా జనగాం సభలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఓవైసీకి భయపడే విమోచన దినం జరపడం లేదని’ అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సెప్టెంబర్‌ 17 అధికారికంగా నిర్వహిస్తామని వాగ్ధానం చేశారు. దీంతో పాటూ బైరాన్‌పల్లిలో అమరవీరుల స్మారకం నిర్మిస్తామన్నారు.ప్రస్తుత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న జనగాం ఎమ్మెల్యే భూకుంభకోణాల్లో ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌ అన్నీ కుటుంబ పార్టీలే అంటూ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లను 2జీ పార్టీ అని..3 తరాల నేతల ఎంఐఎంను 3జీ పార్టీగా అభివర్ణించారు. ఇక కాంగ్రెస్ పార్టీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 4 తరాల నెహ్రూ, ఇందిర, రాజీవ్‌, రాహుల్‌ పార్టీని 4జీ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. కానీ బీజేపీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం’ అని దుయ్యబట్టారు.

there-are-two-more-diwalis
there-are-two-more-diwalis
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular