బావ–బామ్మర్ది ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రండి.. అక్కడే సమాధానం చెబుతా: మంత్రి జూపల్లి
“Both the brother-in-law and the brother-in-law’s brother-in-law should come to Gun Park together… I will give the answer right there,” said Minister Jupally.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని తాను వాస్తవాల ఆధారంగా చెప్పానని తెలిపారు.
తన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వస్తానని చెప్పారని, అందుకే బావ–బామ్మర్ది ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు రావాలని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు.
“నేను కూడా గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వస్తున్నాను. మీరు విసిరిన సవాల్‌కు అక్కడే, ప్రజల సమక్షంలో వాస్తవాలతో సమాధానం చెబుతాను” అని అన్నారు.
కేటీఆర్ ఒకచోట, హరీశ్ రావు మరోచోట మాట్లాడడం ఎందుకని ప్రశ్నించిన జూపల్లి, ఇద్దరూ కలిసి గన్‌పార్క్‌కు వస్తే ఒకేసారి ఇద్దరికీ సమాధానం ఇస్తానని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అప్పులు, బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల ముందే బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.




