హైదరాబాద్, నవంబర్ 21,(వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార జోరుని బీజేపీ మరింత పెంచింది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, నితిన్ గడ్కారీ, నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడలొ బీజేపీ అభ్యర్ధి పూస రాజు తరపున పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఫడ్నవీస్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రచారం ఆర్భాటం తప్ప కేసీఆర్ వల్ల తెలంగాణలో ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గెలిపించాలని కోరారు.తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఎలాంటి లాభం ఉండదని, తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం అన్నారు .అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అని దీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో మాఫియా రాజ్యం
Published By Voice Today Team
105
- Advertisement -
- Advertisement -
- Tags
- cm devendra fadnavis
- devendra fadnavis
- devendra fadnavis about bjp manifesto
- devendra fadnavis bjp
- devendra fadnavis campaign
- devendra fadnavis election campaign
- devendra fadnavis live
- devendra fadnavis news
- devendra fadnavis press conference
- devendra fadnavis releases bjp manifesto
- devendra fadnavis resignation
- devendra fadnavis speech
- devendra fadnavis wife
- ex cm devendra fadnavis
- lop devendra fadnavis
- maharashtra cm devendra fadnavis



