సికింద్రాబాద్ నవంబర్ 21: సికింద్రాబాద్ నియోజక వర్గం సీతాఫల్మండి డివిజన్ లోని చిలుకల గూడ, కింది బస్తీ, శ్రీనివాస్ నగర్,మార్కండేయ నగర్ ప్రాంతాల్లో బిజెపి అభ్యర్థి మేకల సారంగపాణి పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి వెళ్తూ కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం వస్తుందని అన్నారు. బీసీ నీ బిజెపి సీఎం అభ్యర్థిగా ప్రకటించారని పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణ బిజెపి తోనే సాధ్యమని,మోడీ నగరంలో జరిగిన ఓ సభలో ఏబిసిడి వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజక వర్గం అభివృద్ధికి నోచుకోలేదని, తాను ఎమ్మెల్యే అయ్యాక సికింద్రాబాద్ రూపు రేఖలు మార్చుతామని వెల్లడించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏ బస్తీ చూసినా సమస్యలు పేరుకుపోయాయని,పార్శి గుట్టను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి తిరిగి ఇటువైపు కూడా చూడలేదని అన్నారు.



