కమలం వాడిపోతుంది….

- Advertisement -

హుజురాబాద్ లో హస్తం గెలుస్తుంది —-

మాయమాటలతో ఓటర్ల చెవిలో పువ్వులు పెట్టడానికి పువ్వు, కారు పార్టీలు వస్తున్నాయి….

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

హుజురాబాద్: మాయమాటలతోప్రజలను మోసం చేసేందుకు వస్తున్న పువ్వు పార్టీలను నియోజకవర్గం నుండి తరిమికొట్టాలని గతంలో కల్లిబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన బిఆర్ ఎస్  ,బజాపా ఎర్రి పుష్పాలను ఏరిపారేయాలని జమ్మికుంట ప్రజలకు విజ్ఞప్తి చేశారు .శనివారం రోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోతులగూడెం , అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వోడితెల ప్రణవ్ బాబు మాట్లాడుతూ బిఆర్ఎస్  ,బిజెపి పార్టీలపై ధ్వజమెత్తారు .నియోజకవర్గం లోని ప్రజలందరి  కష్టాలలో తోడుంటా హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ కష్టసుఖాలలో పాలుపంచుకుంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్ బాబు ప్రజలకు హామీనిచ్చారు .ప్రణవ్ బాబు రాకను స్వాగతించిన గ్రామస్తులు ప్రణవ్ కు డప్పుచప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలు చేస్తూ గ్రామ ప్రజలు గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు .కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అభివాదం చేశారు.  నేను మీలో ఒక్కడిని మీ ఇంట్లో కొడుకు లాగా ఆదరించాలని మీతో పాటు మీ కష్టసుఖాలలో పాలుపంచుకుంటానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించింది ప్రజలకు చేసింది ఏందని ప్రశ్నించారు. మేనిఫెస్టో రూపొందించిన తర్వాత మేము నిర్ణయించిన 500 గ్యాస్ సిలిండర్ ధరను 400 కి ఇస్తాను అనడం విడ్డూరంగా ఉందన్నారు. గత పదెల్లుగా అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని సిలిండర్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి మనం బహుమానంగా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అన్నారు .నియోజకవర్గంలోని హమాలి కార్మికుల సంక్షేమం కోసం హమాలీ బోర్డ్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular