కేసు నమోదు చేసిన ద్వారకా పోలీసులు
విశాఖపట్నం: ఇంటర్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై ద్వారకా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి రామాటాకీస్ రోడ్డులో ఉన్న సంజీవి జూనియర్ కళాశాల లో ఓ బాలిక ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది అదే కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్గా పని చేస్తున్న వెంకట నాయుడు అనే వ్యక్తి సదరు బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. అనంతరం ఆమెకు నగ్నంగా ఉన్న వీడియోస్ ఫొటోల్నీ తరచూ పంపించి అసభ్యంగా వ్రవర్తించే వాడు దీంతో బాలిక ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లింది. మంగళవారం వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఐపీసీ 323, 354ఏ, 509,11రెడ్విత్12, 21సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే అదే కళాశాలలో పని చేస్తున్న మరో వ్యక్తి కూడా బాలికను వేధించే వాడని అనుమానిస్తున్నారు.