కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకోవచ్చు: రేవంత్‌రెడ్డి

- Advertisement -

బీఆర్ఎస్ కు 25కి మించి ఒక్క సీటు కూడా పెరగదు : రేవంత్ రెడ్డి

కామారెడ్డి..: ”డిసెంబరు 3కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆరోజే శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారు. శ్రీకాంతాచారి త్యాగంతో దేశమంతా ఉలిక్కిపడింది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. నవంబరు 29న మొదలైన ఎన్నికల కార్యాచరణ డిసెంబరు 3న ముగియనుంది. డిసెంబరు 3న దొరల తెలంగాణ అంతమవుతుందని చెప్పాం. చాలా మంది మేం చెప్పింది నమ్మలేదు. కానీ, తెలంగాణ ప్రజల చైతన్యంపై మాకు నమ్మకం ఉంది. తెలంగాణకు పట్టిన పదేళ్ల పీడ తొలగిపోనుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls) అన్నీ కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. గతంలో పోలింగ్‌ ముగియగానే కేసీఆర్‌ మీడియా ముందుకు వచ్చేవారు. ఎన్నికల ఫలితాలు వారికి అనుకూలంగా లేవని భారాస అధినేత కేసీఆర్‌ మీడియా ముందుకు కూడా రాలేదు. ఆ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ప్రజలంటే వారికి చిన్నచూపు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమే. కాంగ్రెస్‌ పార్టీ పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయాల్లో విపక్షాల అభిప్రాయాలకు విలువ ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా కేసీఆర్‌ వ్యవహరించారు. ఆయన వలే నియంతృత్వంగా కాంగ్రెస్‌ నేతలు ఉండరు. అధిష్ఠానం సూచన ప్రకారం సీఎల్పీ సమావేశం నిర్వహిస్తాం. సీఎల్పీ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుంది. పార్టీలో చర్చించి ప్రభుత్వ ఏర్పాటు తేదీని నిర్ణయిస్తాం” అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular