Sunday, December 15, 2024

హంగ్ వస్తే కింగ్ ఎవరు…

- Advertisement -

హైదరాబాద్, డిసెంబర్ 1, (వాయిస్ టుడే):  తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పోలింగ్ పూర్తయింది. అధిక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తున్నాయి. కానీ కొన్ని హంగ్ ను అంచనా వేస్తున్నాయి.  అందుకే ఫలితాలు ఎలా వస్తే ఎలా స్పందించాలన్న దానిపై ముందుగానే అన్ని రాజకీయ పార్టీలు ప్లాన్ బీ రెడీ చేసుకుంటాయి. అదీ తేడా కొడితే ఏం చేయాలన్నదానిపై ప్లాన్ సీ కూడా రెడీ చేసుకుంటాయి.  ఎన్నికల కౌంటింగ్ తర్వాత హంగ్ వస్తే.. ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం లేదు. ఓ రెండు పార్టీలు కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆ రెండు పార్టీలు ఏమిటన్నది ఇప్పుడు కీలకం.  బీఆర్ఎస్ పార్టీ ఏ జాతీయ పార్టీతో కలుస్తుందన్నదే చర్చనీయాంశం. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కలవవు. బీఆర్ఎస్‌తో ఓ జాతీయ  పార్టీ మాత్రమే కలవాల్సి ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. సాధారణ మెజార్టీ రావాలంటే 60 అసెంబ్లీ స్థానాలు సాధించాల్సి ఉంటుంది. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితికి ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఉంది. ఆ పార్టీకి 60 సీట్ల అక్కర్లేదు. 53 సీట్లు సాధిస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. ఎందుకంటే.. మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్‌కు ఏకపక్షంగా మద్దతు పలుకుతుంది. తర్వాత ఏమైనా పాలనలో జోక్యం చేసుకుంటుందేమో కానీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎలాంటి షరతులు పెట్టదు. రెండు పార్టీల మధ్య ఆ అవగాహన ఉంటుంది.

Who is the king if Hung comes...
Who is the king if Hung comes…

ఎలా చూసినా మజ్లిస్ కు ఆరు నుంచి ఏడు స్థానాలు ఖాయం. నాంపల్లి సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. అక్కడ ఫలితం తారుమారైతే ఆరు స్థానాలు ఖాయం. బీఆర్ఎస్‌కు తగ్గే సీట్లు ఈ వీటితో సరిపోతే పంచాయతీనే ఉండదు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో మరోసారి అధికారానికి దూరం అవుతాయి. అంటే హంగ్ వస్తే బీఆర్ఎస్ – మజ్లిస్ కలిసేందుకు మొదటి చాయిస్ ఉంది. అయితే ఈ కూటమికి కొన్ని షరతులు వర్తిస్తాయి. అందులో మొదటికి బీఆర్ఎస్ కనీసం 53 లేదా 54 సీట్లు సాధించాల్సి ఉంటుంది. లేకపోతే వర్కవుట్ కాదు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ కు ఇన్ని స్థానాలు ఇవ్వడం లేదు. మజ్లిస్ మద్దతు కూడా సరిపోనంత తక్కువగా  బీఆర్ఎస్‌కు సీట్లు వస్తే.. ఆ పార్టీకి  జాతీయ పార్టీల్లో ఒకదానిని ఎంచుకునే చాయిస్ ఉంది.  కాంగ్రెస్ , బీజేపీ పార్టీలతో చర్చలు జరపడానికి అవకాశం ఉంది. అయితే ఎవరు బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తారన్నది కీలకం. మజ్లిస్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తే..  బీజేపీకి అంత కన్నా ఎక్కువ సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే ఆ రెండు పార్టీలు కలిసే చాన్స్ ఉంటుంది ఎందుకంటే.. బీజేపీ ప్రేమిస్తే బీఆర్ఎస్ ప్రేమించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లుగా రాజకీయాలు చేయడంలో బీజేపీ రాటుదేలిపోయింది. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్.. బీఆర్ఎస్ పార్టీ .. ప్రభుత్వ ఏర్పాటుకు తమపై ఆధారపడే అన్ని సీట్లు సాధించాలని తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం  చేశారని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించడం కష్టమైన పరిస్థితుల్లో బీజేపీ అదే  వ్యూహాన్ని అమలు చేసిందని చెబుతున్నారు.  ఎన్నికల ఫలితాల ముందు రాజకీయాలకు.. ఎన్నికల ఫలితాల రాజకీయాలకు సంబంధం ఉండదు. అప్పటి రాజకీయాలు అప్పటివే. బీఆర్ఎస్, బీజేపీ పొత్తుల్ని ఎవరూ కాదనలేరు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్ట రాకపోతే కాంగ్రెస్ ఏం చేస్తుందన్నది  కూడా ఆ పార్టీకి ప్లాన్  బీ ఉందో లేదో స్పష్టత లేదు. నిజానికి తెలంగాణ ఎన్నికలు ఇతర పార్టీల కంటే.. కాంగ్రెస్ కు అతి పెద్ద సవాల్. కాంగ్రెస్ మెజార్టీ మార్క్ ను తెచ్చుకుంటే… ఏ సమస్యా ఉండదు. ఓ సారి  కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం చేస్తే.. ప్రభుత్వాన్ని  కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేస్తారు. గతంలో  కేసీఆర్ చూపించిన దారిలోనే వెళ్లవచ్చు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వానికి మజ్లిస్ మద్దతు తెలుపుతుంది. అందులో సందేహం లేదు. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు సీట్లు తగ్గితే కాంగ్రెస్ బీఆర్ఎస్‌తో కలుస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్. బీఆర్ఎస్ ఒక వేళ బీజేపీ వద్దు.. కాంగ్రెస్ తోనే కలుద్దామన్న  ప్రతిపాదన తెస్తే.. ఏం చేస్తుందన్నది ప్లాన్ బీలో భాగం. ఒక వేళ అధికారంలో భాగం పంచుకోకపోతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారన్న గ్యారంటీ లేదు. అధికారంలో భాగం అయితే..  ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మారుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ కు భవిష్యత్ లో నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డి వంటి నేతలు బీఆర్ఎస్ తో కలిసి అధికారం పంచుకోవడాన్ని అసలు అంగీకరించకపోవచ్చు. తెలంగాణ ఫలితాల్లో హంగ్ అంటూ వస్తే అసలు పరీక్ష  కాంగ్రెస్ పార్టీకే ఎదురవుతుంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నపార్టీకి ఎమ్మెల్యేల్ని కాపాడుకోవడం పెద్ద సమస్య అవుతుంది. మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో పోరాడటం సమస్యగా మారుతుంది. అలాగని బీఆర్ఎస్ పార్టీతో కలవలేరు. ఒక వేళ మజ్లిస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలిగిగే సీట్లు  తెచ్చుకున్నా… అది ముళ్లబాటే అవుతుంది. అందుకే ఇతర పార్టీల ప్లాన్ బీ, సీల కన్నా … పూర్తి మెజార్టీ రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్