భర్తను సుపారీగ్యాంగ్ తో హత్య చేయించిన భార్య

- Advertisement -

భర్తను సుపారీగ్యాంగ్ తో హత్య చేయించిన భార్య
హన్మకొండ

Wife Hires Contract Killers to Murder Husband
ప్రియుడి మోజులో పడి భార్య సుపారీ గ్యాంగ్తో భర్తను హత్య చేయించింది. హన్మకొండ జిల్లా తాడ్వాయిలో 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సుమన్, లావణ్య.. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడగా.. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డుగా ఉన్నాడని, సుపారీ గ్యాంగ్తో కలిసి లావణ్య  పథకం వేసింది. అందులో  భాగంగా సుమన్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బీరు సీసాలతో విచక్షణారహితంగా పొడిచి చంపి, తర్వాత ఎవరూ గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టింది  సుపారీ గ్యాంగ్. అయితే, పోలీసులు లావణ్య తీరుపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో అసలు నిజం బయటపడింది. ప్రియుడితో కలిసి ఉండడానికి భర్తను తానే హత్య చేయించినట్లు లావణ్య ఒప్పుకుంది.  లావణ్యను, ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular