కాలుజారి పడటంతో విరిగిన తుంటి ఎముక
మాజీ సీఎం కేసీఆర్ గురువారం అర్ధరాత్రి యశోద ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో ఆయనకు గాయమైనట్లు సమాచారం. కేసీఆర్ కాలి తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్‌కు శస్త్ర చికిత్స చేయాల్సి రావొచ్చని, వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ విషయంపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.
కేసీఆర్‌కు గాయం కావడంపై ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. ‘బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు స్వల్ప గాయం కావడంతో ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో నిపుణుల సంరక్షణలో ఉన్నారు. మీ అందరి ప్రార్థనలతో నాన్న త్వరలోనే పూర్తిగా కోలుకోనున్నారు. అందరి ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు.



