హైదరాబాద్, డిసెంబర్ 8, (వాయిస్ టుడే): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణీస్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డితా పాటు… పలువురు మంత్రులతో గవ్నరర్ తమిళిసై ప్రమాణం చేయించారు. ఇక ఇదిలా ఉంటే… స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తిని రేపింది. ఈ పదవిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ను స్పీకర్ గా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. రేపోమాపో ఆయన… స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి అసెంబ్లీ స్పీకర్ గా మధుసూదన చారికి అవకాశం దక్కగా… 2018లో పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు తొలిసారి అధికారం దక్కగా… గడ్డం ప్రసాద్ కుమార్ కు దక్కినట్లు అయింది.గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో మంత్రిగా కూడా పని చేశారు. ఇయన వికారాబాదు జిల్లా మర్పల్లి గ్రామంలో జన్మించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్.. రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న గడ్డం ప్రసాద్.. 2008 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో గడ్డం ప్రసాద్ మంత్రిగా పనిచేశారు. 2012లో సీఎంగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లోనూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఆ తర్వాత వచ్చిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ వరుస ఓడిపోయారు. 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. కాగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ.. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు సార్లు మంత్రిగా చేసిన అనుభవం ఉండడంతో కాంగ్రెస్ అధిష్ఠానం గడ్డం ప్రసాద్ కుమార్కు స్పీకర్ బాధ్యతలు అప్పగించింది. తాండూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి. సంజీవరావు పై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇక 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎ.చంద్రశేఖర్ పై(టీఆర్ఎస్) 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.గడ్డం ప్రసాద్ కుమార్ 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో టెక్స్టైల్ శాఖ మంత్రిగా పని చేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మెతకు ఆనంద్ పై పోటీ చేసి వికారాబాద్ స్థానం నుంచి గెలిచారు
స్పీకర్ గా గడ్డం…
Published By Voice Today Team
164
- Advertisement -
- Advertisement -
- Tags
- gaddam prasad
- gaddam prasad as assembly speaker
- gaddam prasad kumar
- gaddam prasad kumar congress speaker
- gaddam prasad kumar elected as speaker of telangana assembly
- gaddam prasad kumar telangana speaker
- gaddam prasad telangana speaker
- speaker gaddam prasad kumar
- telangana assembly speaker gaddam prasad kumar
- telangana new speaker gaddam prasad kumar
- telangana speaker gaddam prasad kumar
- vikarabad constituency gaddam prasad kumar news



