న్యూ ఢిల్లీ: త్వరలో రీజనల్ రింగ్ రోడ్ పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. మంగళవారం అయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఛైర్మన్ను కలిసి చర్చిస్తాను. గత ప్రభుత్వం రూ. 300 కోట్ల విషయంలో ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా చేసింది. . 20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పూర్తిగా కేంద్రం భరిస్తోందని అన్నారు.
యుటిలిటీ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కోరింది. గత ముఖ్యమంత్రి రూ. 300 కోట్లు ఇవ్వలేమని లేఖ రాయడంతో పనులు ప్రారంభం కాలేదు. 340 కి.మీ పొడవైన రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకే మణిహారం. సగం తెలంగాణ రాష్ట్రం దీని కింద కవర్ అవుతుంది. దేశంలో మరెక్కడా ఇంత పెద్ద రింగ్ రోడ్డు ప్రాజెక్టు లేదు. మా ముఖ్యమంత్రితో చర్చించి యుటిలిటీ ఖర్చులు భరిస్తామంటూ కేంద్రానికి లేఖ రాయిస్తానని అన్నారు. నెల రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చూస్తాం. రూ. 60 కోట్లకు ఒక టెండర్ చొప్పున బిట్లుగా పనిని విభజించి త్వరగా పూర్తయ్యేలా చూస్తామని అన్నారు.



