ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ డిసెంబర్ 12:  ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గత ప్రధాని మన్మోహన్, సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. ఏపీని ఆదుకోవాలని పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ అది అని చెప్పుకొచ్చారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ అమలుపరచకపోవడం బాధాకరమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారని… ప్రస్తుత ప్రధాని దానిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular