రాజన్నకు హుండి ద్వారా రూ.1,86 లక్షల ఆదాయం

- Advertisement -

రాజన్నకు హుండి ద్వారా రూ.1,86 లక్షల ఆదాయం
సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో  14 రోజుల హుండీ లెక్కింపు జరిగింది. నగదు రుపెనా ఒక కోటి 86 లక్షల 42 వేల 959 రూపాయలు, బంగారం 360 గ్రాములు, వెండి 14 కిలోల  ఆదాయం సమకూరిన్నట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు.  రాజన్నను ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. ఆర్జిత సేవల ఆదాయం కాకుండా కేవలం హుండీ ద్వారానే దాదాపు ఒక కోటి 86 లక్షల రూపాయలు ఆదాయం సముకూరిన్నట్లు ఈవో చెప్పారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బందితోపాటు స్వచ్ఛంద సేవ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ఎస్పిఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా హుండీ కౌంటింగ్ పర్యవేక్షించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular