హత్యా రాజకీయాలు చేసే వారిని వదిలిపెట్టను

- Advertisement -

హత్యా రాజకీయాలు చేసే వారిని వదిలిపెట్టను
మంత్రి గుడివాడ అమర్నాథ్
అనకాపల్లి
గ్రామాల్లో హత్య రాజకీయాలుకు పాల్పడే  వారిని వదిలిపెట్టేది లేదని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం లో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. ఈనెల పేదల కు ప్రభుత్వం చేస్తున్న పండగ నెల అని అన్నారు 2019లో లబ్ధిదారులకు 2000 పెన్షన్ ఉండగా దానిని పెంచుకుంటూ 2024 నాటికి 3000 రూపాయలు కు పెంచామని అన్నారు. 2019లో ఎటువంటి అభివృద్ధి చేయకపోయినా ఓట్లు వేశారని ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయమని జగన్మోహన్ రెడ్డి గారు సూచించారని తెలిపారు రాష్ట్రంలో 2019 నాటికి 36 లక్షల మంది పెన్షనర్లు కు 36 లక్షల కోట్లు పెన్షన్ పంపిణీ చేయగా ప్రస్తుతం 2024 నాటికి 66 లక్షల మంది లబ్ధిదారులకు 66 లక్షల కోట్లు పెన్షన్ పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని అటువంటి వారికి వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్ల బుల్లిబాబు ,వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular