ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు పవన్ కళ్యాణ్

- Advertisement -

ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు
పవన్ కళ్యాణ్
అమరావతి
50 స్థానాలు తీసుకోండి 60 తీసుకోండి అంటు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నాకు ఏమి తెలియదు అని చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. ఇవేమీ తెలియకుండా నేను రాజకీయాలలోకి వచ్చాను అనుకుంటున్నారా. నేను ఒక్కడినే ఎందుకు  వెళ్ళలేదు అనే విషయంలో నాకు అవగాహన ఉంది. 2019 ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేసే వాళ్ళం. గత ఎన్నికలలో 18 లక్షల ఓట్లు సంపదించామని గుర్తు చేసారు.
మనం సింగిల్ గా వెళ్తే సీట్లు సాధిస్తాం కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేము. జగన్ అనే వ్యక్తి టీడీపీని టార్గెట్ చేయడంతో  పాటు మనల్ని వదలడం లేదు. సొంత చెల్లిని వదలని వ్యక్తి మనల్ని వదులుతాడా. వైఎస్ జగన్ కు ఊరంతా శతృవులే. వైసీపీ నేతలకు కష్టం వస్తె నా దగ్గరకు రావాలి. టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్.పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు చేశారు.అందుకు పార్టీ  నేతలకు నేను క్షమాపణలు చెప్తున్నా.టీడీపీ సీట్లు అనౌన్స్ చేయడం పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసింది.లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడిన నేను పట్టించుకోలేదని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనలు దృష్టికి పెట్టుకొని నేను మౌనంగా ఉంటున్నా. సీనియర్ నేతగా ముఖ్యమంత్రిగా ఉన్నారు  కాబట్టి  అలా జరుగుతూ ఉంటాయి.అనుకోకుండా కొన్ని జరుగుతాయి. వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.పార్టీ నేతలు అర్దం చేసుకోవాలని కోరుతున్నా. పొత్తును ఇబ్బందులకు గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం 2024 లో మళ్ళీ అధికారంలోకి రాకూడదు.  జగన్ పై  నాకు వ్యక్తిగత కక్ష లేదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular