సిద్దం బహిరంగ సభకు వైకాపా నేతలు సిద్ధం కండి

- Advertisement -

 సిద్దం బహిరంగ సభకు వైకాపా నేతలు సిద్ధం కండి
పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్ర రెడ్డి పిలుపు
అన్నమయ్య
పీలేరు నియోజకవర్గం, కంభంవారి పల్లి మండలం,వగళ్ళలో సిద్దం బహిరంగ సభకు ప్రణాళిక సిద్దం చేసినట్లు పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్ర రెడ్డి తెలిపారు. వగళ్ళలో నిర్వహించిన సభలో కార్యకర్తలతో మాట్లాడుతూ.. అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే సిద్ధం సభకు మనందరం బయలుదేరి వెళ్ళాలి అని తెలిపారు. 2024 ఎన్నికలు కష్టమేమీ కాదు, కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దన్నారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పరిపాలనా వ్యవస్థలు కుప్పం లా కూలి పోతాయన్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద వైకాపా కార్యకర్తలకు అప్రమత్తంగా వుండాలి. ద మంది తక్కువ లేకుండా వైకాపా కార్యకర్తలు పోలింగ్ బూత్ వద్ద పర్యవేక్షించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.
వైకాపా కార్యకర్తలు, అభిమానులందరూ ఉదయం 7-9 గంటల లోపే ఓట్లు వేసేలా ఓటర్లను చైతన్యం చేయాలని, మన ప్రభుత్వం అధికారంలో వుంటేనే మనం ఏవిధమైన సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు అన్నారు.
శాసన సభ్యులు గెలిస్తేనే వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, తెలుగుదేశం పార్టీ వారు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారని ఇప్పుడే మన యంత్రాంగం అంతా అప్రమత్తంగా వుండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతపురంలో ముఖ్యమంత్రి నిర్వహించే సిద్ధం సభకు మన నియోజకవర్గము నుంచి ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేలా చేసే బాధ్యత ప్రతి ఒక్క వైయస్సార్సీపి నాయకుడు తీసిఒక్కోవాల్సిందిగా పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్ర రెడ్డి సభలో తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular