మేడారం జాతరకు ఒకప్పుడు కాలినడకన, ఎడ్ల బండ్లలో వెళ్లేవారు. తర్వాత బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్తున్నారు. గత మూడు జాతరల నుంచి హెలీకాప్టర్‌లోనూ జాతరకు వస్తున్నారు. ఎప్పటిలాగే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆకాశమార్గాన అమ్మల దర్శనానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
● హనుమకొండ నుంచి..: హనుమకొండ నుంచి మేడారం వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగుపయనం చేస్తారు. భక్తుల కోసం ప్రత్యేకంగా హెలీకాప్టర్ జాయ్‌రైడ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జాతర పరిసరాలను విహంగ వీక్షణంతో ఆస్వాదించవచ్చు. ఇదివరకు సేవలందించిన ప్రైవేటు సంస్థతోనే అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ధరలు రెండు రోజుల్లో నిర్ణయించనున్నట్లు సమాచారం.
మేడారం జాతరకు హెలీకాప్టర్
- Advertisement -
- Advertisement -



