- Advertisement -
పలు నియోజకవర్గాల నేతలతో సమీక్ష
రాజమండ్రి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం చేరుకున్నారు. దాంతో జనసైనికులు, అభిమానులు కార్యాలయం బయట భారీ సంఖ్యలో చేరుకున్నారు. కారు నుంచి అభివాదం చేసి పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్లారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల నాయకులతో పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు..
- Advertisement -