Thursday, December 26, 2024

కవిత అరెస్ట్ ప్రభావం ఎంత…

- Advertisement -

కవిత అరెస్ట్ ప్రభావం ఎంత…
హైదరాబాద్,  మార్చి 18
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్ట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఢిల్లీ నుంచి పది మంది ఈడీ అధికారుల బృందం హైదరాబాద్‌లోని కవిత ఇంటికి వచ్చిన తర్వాతనే విషయం వెలుగులోకి వచ్చింది.  సోదాలు  సింపుల్‌గా పూర్తి చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే వారెంట్లతో సహా వచ్చారని తర్వాత స్పష్టమయింది. అయితే ఇలాంటి పరిస్థితిని ఊహించని బీఆర్ఎస్ నేతలు గట్టిగా ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. గ్రేటర్ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఎవరూ కవిత ఇంటి వద్దకు రాలేదు. కేటీఆర్, హరీష్ రావు  మాత్రమే వచ్చారు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించుకునేలోపు కవితను ఢిల్లీకి తరలించారు. కవిత అరెస్టును ఖండించాల్సిందేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె ఆరెస్టు కుట్ర ప్రకారమే జరిగిందన్నారు. అయితే రేవంత్ ఉద్దేశంలో ఆ కుట్ర బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకూ కేసీఆర్ కవిత అరెస్టుపై స్పందించలేదని తెలంగాణ పర్యటనలో ఉన్న మోదీ కూడా.. కవిత అరెస్టుపై స్పందించలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు.  ఈడీ, సీబీఐ మోదీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అనిస్పష్టం చేశారు. కవిత విషయంలో కేసీఅర్ కే ఒక విధానపరమైన నిర్ణయం లేదన్నారు. ఎన్నికల ముందు ఈ డ్రామాలు తెలంగాణ సమాజం గమనించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు నాటకం ఆడుతున్నారని.. కవిత పై తండ్రిగా కేసీఅర్ కనీసం స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కనీసం మోదీ కూడా దీనిపై స్పందించలేదని గుర్తు చేశారు. కేసీఅర్, మోదీ మౌనం వెనక మతలబు ఎంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు. నిజానికి  కవితను ఎక్కడ అరెస్టు చేస్తారో అని కాంగ్రెస్ నేతలు కూడా కంగారు పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో ఇలాంటివి బీఆర్ఎస్ పై సానుభూతి పెంచుతాయనే ఆందోళన ఆ పార్టీలో కనిపించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయలేని పరిస్థితి . సీనియర్ నేతలంతా  పార్టీ నుంచి వైదొలుగుతున్నారు. గట్టి అభ్యర్థులు కనిపించడం లేదు. ఎన్నికలు ఎదుర్కోవడానికి సరైన ఇష్యూ లేదు. ఇలాంటి సమయంలో కవిత అరెస్ట్ ద్వారా సానుభూతి ప్రయోజనం  పొందే రాజకీయ అవకాశం వచ్చినట్లయింది. రాజకీయాల్లో సానుభూతిది తిరుగులేని అస్త్రం. తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ ఫ్యామిలీని ఇలా కేసులతో ఇబ్బంది పెడుతున్నారని వారికి మద్దతుగా ఉండేలా.. అందర్నీ ఏకం చేయగలిగితే.. ఓట్ల వెల్లువ వస్తుందన్న ఆలోచనతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కవితను ఈడీ కస్టడీకి పంపించారు. మనీలాండరింగ్ కేసు కాబట్టి బెయిల్ దొరకడం చాలా కష్టమని అంటున్నారు. అయితే మహిళ కాబట్టి.. న్యాయస్థానాలు కస్టడీ పూర్తయిన తర్వాత బెయిల్ ఇచ్చే అవకాశాలనూ కొట్టి పారేయలేమంటున్నారు. అయితే బెయిల్ వచ్చినా రాకపోయినా.. అరెస్ట్ అంటూ జరిగింది కాబట్టి .. సానుభూతి రాజకీయం కోసం ప్రయత్నించే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో ఒక్కో నేతది ఒక్కో స్టైల్. సానుభూతి అస్త్రాన్ని పకడ్బందీగా వాడే నేతలు వేరుగా ఉంటారు. కానీ కేసీఆర్ మాత్రం ఉద్యమ నేత. తనపై జాలి చూపాలని ఆయన ప్రజల్ని కోరుకోరు. అలాంటి రాజకీయాలు చేయలేరు . చేసినా  మిస్ ఫైర్ అవుతుంది. అందుకే ఎలా స్పందించాలో అర్థం కాక.. ఎలా స్పందిస్తే ఏం జరుగుతుందో అని కేసీఆర్ వీలైనం మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. అయితే కవిత కోసం ఆయన తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. సానుభూతి రాజకీయాలు కేసీఆర్ పొలిటికల్ డీఎన్‌ఏలో లేవు. అందుకే.. కవిత అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటారు కానీ.. సానుభూతి రాజకీయాలకు వాడుకునే అవకాశాలు  లేవని భావిస్తున్నారు. కవితపై తెలంగాణలో అవినీతి చేశారని కేసు పెడితే.. అది రాజకీయం అయ్యేది. కానీ ఢిల్లీలో అవినీతి కేసులో పెట్టారు. ఇది కాస్త విచిత్రమైన కేసు. మహిళా  నేత అయి ఉండి లిక్కర్ స్కాం చేయడం ఏమిటన్న ప్రశ్న చాలా వర్గాల నుంచి వస్తోంది. అయితే ఈ కేసుతో తనకు సంబంధమే లేదని కవిత చెబుతన్నారు. కానీ ఆమెకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని.. నిందితులు అందరూ అప్రూవర్లుగా మారారు. వచ్చిన సొమ్ముతో కవిత ఆస్తులు కొన్నట్లుగా  చెబుతున్నారు ఈ క్రమంలో కవిత అరెస్ట్ అక్రమం అని ప్రజలు నమ్మడం కష్టమన్న వాదన ఉంది. ప్రజలు నమ్మితే మాత్రం పెద్ద ఎత్తున ప్రజల మద్దతు వస్తుంది. అది లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల రూపంలో కనిపిస్తుంది. కానీ దానికి చాన్స్ అతి తక్కువ అనుకోవచ్చు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్