Friday, December 27, 2024

ప్యాకేజీల కోసం కాదు.. ప్ర‌జా సేవ కోస‌మే..

- Advertisement -

ప్యాకేజీల కోసం కాదు.. ప్ర‌జా సేవ కోస‌మే..
స్ప‌ష్టం చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్
హైద‌రాబాద్ మార్చ్ 18
ప్యాకేజీల కోసం కాదు.. ప్ర‌జా సేవ కోస‌మే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న‌ట్లు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌మక్షంలో ఇవాళ పార్టీలో చేరుతున్న‌ట్లు ఆర్ఎస్పీ ప్ర‌క‌టించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించి అనంత‌రం ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ఉద్య‌మ నేత‌, బీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌ని చేసే అవ‌కాశం రావ‌డం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ భ‌వ‌న్‌కు సాద‌రంగా ఆహ్వానించి, అక్కున చేర్చుకున్న బీఆర్ఎస్ నాయ‌క‌త్వానికి హృద‌య‌పూర్వ‌క వంద‌నాలు. న‌న్ను న‌మ్మి చివ‌రి వ‌ర‌కు నాతో ప్ర‌యాణం చేసేందుకు వ‌చ్చిన ఆప్తుల‌కు కూడా ధ‌న్య‌వాదాలు. న‌న్ను అక్కున చేర్చుకుని ఇంత దూరం న‌డిపించిన తెలంగాణ ప్రజానీకానికి పాదాభివంద‌నాలు తెలిపారు ఆర్ఎస్పీ.
తెలంగాణ వాదం, బ‌హుజ‌న వాదం రెండూ ఒక్క‌టే
తెలంగాణ వాదం, బ‌హుజ‌న వాదం రెండూ ఒక్క‌టే. ప్రాణ‌హిత‌, గోదావ‌రి న‌దులు క‌లిసిన‌ట్లు, కృష్ణా, తుంగ‌భ‌ద్ర న‌దులు ఏ విధంగా క‌లుస్తాయో.. ఆ మాదిరిగానే తెలంగాణ వాదం, బహుజ‌న వాదం ఒక్క‌టే. త‌ర‌త‌రాలుగా అణిచివేత‌కు గురైన తెలంగాణ‌కు కేసీఆర్ విముక్తి క‌ల్పించారు. బ‌హుజ‌నులు కూడా అణిచివేత‌కు గుర‌య్యారు. వారికి విముక్తి క‌ల్పించి వారిని వెలుగు వైపు న‌డిపించింది బ‌హుజ‌న వాదం అని ఆర్ఎస్పీ తెలిపారు.
కేసీఆర్ అధికారంలో లేరు.. కానీ ప్ర‌జ‌ల గుండెల్లో ఉన్నారు..
కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ‌ గ‌త ప‌దేండ్ల‌లో స్వ‌ర్ణ‌యుగాన్ని చూసింది. తెలంగాణ అభివృద్ధి కోసం గొప్ప‌ పునాది వేయ‌బ‌డింది. కేసీఆర్ అధికారంలో లేరు కానీ ప్ర‌జ‌ల గుండెల్లో ఉన్నారు. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్‌ను వీడి వెళ్లిపోతున్నారు. కానీ మీరు బ‌లగంగా వ‌చ్చార‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్లు అన్నారు. బ‌హుజ‌న వాదం అంటే స్వార్థ‌ప‌రులు ఉండేది కాదు. బ‌హుజ‌నులు స్వార్థం కోసం రారు. సంపాద‌న కోసం రారు. బ‌హుజ‌న వాదులంతా కేసీఆర్ వెంట న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. తెలంగాణ పున‌ర్ నిర్మాణంలో భాగ‌స్వాములు కావాల‌ని నిర్ణ‌యించుకుని వ‌చ్చాం అని ఆర్ఎస్పీ తెలిపారు.
నా గుండెల్లో బ‌హుజ‌న వాదం ఉంది..
ఈ మూడేండ్లు త‌న వెంట‌న న‌డించిన వారంద‌రికీ చెబుతున్నాను. నా గుండెల్లో బ‌హుజ‌న వాదం ఉంది. మ‌హ‌నీయుల త్యాగాలు ఉన్నాయి. తెలంగాణ అమ‌ర‌వీరుల త్యాగాల‌ సారాంశం ఉన్న‌ది. వారు చూపించిన దిశ వైపే న‌డుస్తాను. నాలో ఎలాంటి స్వార్థం లేదు. ద‌య‌చేసి న‌న్ను అర్థం చేసుకోండి. నా గుండెల్లో త్యాగ‌ధ‌నులు చూపించిన‌ దిశ‌నే ఉంది. ఆ దిశ‌లోనే న‌డుస్తాను అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్