మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి
మంథని ఎస్ఐ రాణి వర్మ
మంథని
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులు బాగా చదువుకొని అన్ని రంగాలలో ముందుండాలని మంథని ఎస్ఐ రాణి వర్మ అన్నారు. ఎక్లాస్ పూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలిక సాధికారత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థినిలకు డయల్ 100, ఫోక్సో చట్టం షీ టీం హ్యాక్ ఐ, బాల్య వివాహాలు మొదలైన అంశాలపై అవగాహన కల్పించారు. కెనరా బ్యాంకు ప్రతినిధి మాట్లాడుతూ విద్యార్థి దశను ఉండే పొదుపును అలవాటు చేసుకోవాలని సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలను ఉపయోగించుకోవాలని రికరింగ్ డిపాజిట్ల ద్వారా పొదుపు చేయాలనిచేయాలని సూచించారు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్త స్వప్న మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పౌష్టికాహారం పోషకాహార లోప వ్యాధుల పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి ఉపాధ్యాయినిలు వరలక్ష్మి, జోష్ణ, స్రవంతి పాల్గొన్నారు.