ఏపీ వాలంటీర్లకు టీడీపీ ఛీప్ చంద్రబాబు నాయుడు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతామని ప్రకటించారు టీడీపీ ఛీప్ చంద్రబాబు నాయుడు.
టీడీపీ అధికారంలోకి వస్తే రూ. 5000 ఉన్న జీతాన్ని రూ. 10,000 లకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని వారిని కొనసాగిస్తామని తెలిపారు.
ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలి అన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఉగాది పర్వదినం సందర్భంగా చంద్రబాబు పంచాంగ కర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని తెలిపారు. 128 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని వివరించారు. చంద్రబాబే రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతారని వెల్లడించారు.