భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ
ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి కోరుతూ మరోసారి సీఈఓకు లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ
ఆలయ విశిష్టత, సంప్రదాయాలు వివరిస్తూ ఈసీకి మంత్రి లేఖ
కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయడం గత 40 ఏళ్లుగా జరుగుతోందన్న మంత్రి
ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి తాజాగా ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అనుమతి నిరాకరించింది. దీంతో మంత్రి కొండా సురేఖ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి కోరుతూ మరోసారి సీఈఓకు లేఖ రాశారు. ఆలయ విశిష్టత, సంప్రదాయాలు వివరిస్తూ ఈసీకి మంత్రి లేఖ రాశారు. కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయడం గత 40 ఏళ్లుగా జరుగుతోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.