*ఇంటింటి ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు*
చందుర్తి వాయిస్ టుడే ఏప్రిల్ 15 : రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో బిజెపి నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలి అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ని చేసుకుందామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి చింతకుంట గంగాధర్,బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెరుక గంగరాజు, బిజెపి ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు చింతకుంట సాగర్ ,పేరుక రంజిత్,ముప్పిడి సత్తయ్య, మెరుపుల వేణు, అనీలు శేఖర్, ప్రకాష్ ,వెంకటేష్ ,తిరుపతి, మల్లేశం, నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



