ఏపీ రాష్ట్రంలో ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ – తొలి రోజు 229 దాఖలు
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇందులో లోక్సభకు 39, అసెంబ్లీకి 190 నామినేషన్లు దాఖలయ్యాయి.
రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంలోనూ మొదటిరోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి.
ర్యాలీలు నిర్వహిస్తూ, కార్యకర్తల జనసందోహం మధ్య అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా చదలవాడ అరవిందబాబు ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
నరసరావుపేట లోక్‌సభ కూటమి అభ్యర్థఇ లావు శ్రీకృష్ణదేవరాయలు కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారిశివశంకర్‌కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు.
కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ కూటమి అభ్యర్థఇ వర్ల కుమార్ రాజా, ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి జి. శ్రీనివాస్ నాయడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల నాని MRO కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్ల పత్రాలు అందజేశారు. తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి.