టిడిపిలోకి చేరిన 40 కుటుంబాలు
తుగ్గలి
తుగ్గలి మండల పరిధిలోని గల మారేళ్ల గ్రామం మరియు లింగనేని దొడ్డి గ్రామాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,సిపిఐ పార్టీకి చెందిన నాయకులు శుక్రవారం రోజున నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం ఆధ్వర్యంలో టిడిపిలోకి చేరారు.దాదాపు సుమారు 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు మండల కన్వీనర్ తిరుపాల్ నాయుడు తెలియజేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో విఫలమయిందని,అదేవిధంగా రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని,నిరుద్యోగుల్ని విస్మరించడం జరిగిందని,తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంలో విఫలమైనందుకే పత్తికొండ నియోజకవర్గం సమర్థవంతమైన నాయకత్వం ప్రజాసమస్యలు పరిష్కరించగల శక్తి సామర్థ్యం గల వ్యక్తి కెఈ శ్యామ్ కుమార్ అని నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు సభ్యులు తెలియజేశారు.ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించ గల సమర్థుడు అని కేఈ శ్యాంబాబు అని, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని వారు తెలియజేశారు.ఈరోజు చేరిన వారిలో మారెళ్ళ గ్రామానికి చెందిన సిపిఐ పార్టీ నాయకుడు ప్రజానాట్య మండలి గౌరవ జిల్లా అధ్యక్షుడు ఎరుకులప్ప గారి కురువ ధనుంజయ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెళ్ళ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ రామదుర్గం రామాంజనేయులు, మారెళ్ళ గ్రామపంచాయతీ నాలుగవ వార్డ్ మెంబర్ మైకు యశోదమ్మ,ఇరుకులప్ప గారి నరసప్ప,ఇరుకులప్ప గారి చిన్న నరసప్ప, నాగరాజు, ఇరుకులప్ప గారు నరసింహులు, ఇరుకులప్ప గారి భరత్,బత్తిన సుదర్శన్,బత్తిన దేవేంద్ర,దేవేంద్ర,మంకీ లింగన్న,కురువ రామకృష్ణ,కూతల నెట్టికంటయ్య,కూతల రామాంజనేయులు,వీరాంజనేయులు,మైకు పవన్ కుమార్,హరి,నరేష్,పొండికూర సంజన, గోసి రాముడు,కురువ గోపి,మొట్టి రంగన్న అదేవిధంగా లింగనేని దొడ్డి గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి బోయ రామకృష్ణ,బోయ వెంకటేష్,దాసరి బోయ పెద్దయ్య,పెద్ద వెంకట రాముడు,చిన్న వెంకటరాముడు ఆంజనేయులు,దాసరి మద్దిలేటి,దాసరి రవి,దాసరి పెద్దయ్య,చిన్న చిన్నప్ప గారి ఆంజనేయులు,కొత్త బురుజు అంజనేయ,కొత్త బురుజు చంద్రన్న,కొత్త బురుజు మహేష్,మండగిరి రమేష్ తదితరులు సుమారు 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ పత్తికొండ కార్యాలయంలో కేఈ శ్యామ్ కుమార్ వారికి పార్టీ కండువాను కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు,రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ చౌదరి, మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు,ఎద్దుల దొడ్డి శ్రీనివాసులు,కొత్తూరు శివరాముడు తదితర మండల టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.