Saturday, December 14, 2024

కాంగ్రెస్ పార్టీలో దీక్షలు

- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో దీక్షలు
ఏంటీరా…బాబు..
హైదరాబాద్, ఏప్రిల్ 22,
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతల దీక్షలు.. కొందరు నిమ్మరసం ఇవ్వడాలు చర్చనీయాంశం అవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం మోత్కుపల్లి దీక్ష చేయగా.. సీనియర్‌ నేత వీ.హనుమంతరావు దీక్షకు సంఘీభావం తెలుపగా సర్వే సత్యనారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఇప్పుడు.. వీహెచ్‌ మౌన దీక్ష చేయగా.. దానం నాగేందర్‌ నిమ్మరసం ఇచ్చి విరమింపజేయడం ఆసక్తి రేపుతోంది.పార్లమెంట్‌ ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్‌ ఇంట్రస్టింగ్‌ మారుతున్నాయి. ఒకవైపు.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తుంటే.. టీ. కాంగ్రెస్‌లో మాత్రం దీక్షల సీజన్‌ నడుస్తోంది. కొందరు సీనియర్లు దీక్ష చేస్తుంటే.. మరికొందరు ఆ దీక్షలకు మద్దతు తెలిపి.. నిమ్మరసం ఇచ్చి విరమింపజేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ అంబర్ పేటలోని తన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మౌన దీక్షకు దిగారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్లు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఇక.. బీజేపీలోకి వెళ్తున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. బీజేపీలోకి వెళ్తున్నాననే ప్రచారానికి చెక్‌ పెట్టేందుకే ఒక్కరోజు మౌన దీక్ష చేశానన్నారు వీహెచ్‌.ఇదిలావుంటే.. మూడు రోజుల క్రితం మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా ఒక్క రోజు దీక్ష చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గాలకు కాంగ్రెస్‌ రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ మోత్కుపల్లి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. తన ఇంట్లో దీక్ష చేపట్టిన మోత్కుపల్లికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ.హనుమంతరావు సంఘీభావం తెలిపారు. సర్వే సత్యనారాయణ మోత్కుపల్లికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఇక.. 80 లక్షల మంది ఉన్న మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రస్తుత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మోత్కుపల్లి నరసింహులు. అటు.. మోత్కుపల్లి నిరసన దీక్షకు వివిధ జిల్లాల దళిత సంఘాల నేతలు హాజరై సంఘీభావం ప్రకటించారు. మొత్తంగా.. తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల వరుస దీక్షలు హాట్‌టాపిక్‌గా మారాయి. అటు.. మోత్కుపల్లి, ఇటు వీహెచ్‌.. ఇద్దరు దీక్షలు చేపట్టడం.. వారికి టీ.కాంగ్రెస్‌ నేతలే నిమ్మరసం ఇచ్చి విరమింపజేయడాలు ఆసక్తి రేపుతున్నాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్