నిరుద్యోగుల గొంతుకనౌతా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రం అభ్యర్థిగా బరిలో ఉన్న అశోక్
హైదరాబాద్
ఉన్నత చదువులు చదివిన పట్టభద్రులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే పెద్దల సభలో నిరుద్యోగుల గొంతుకను వినిపిస్తానని వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో నియామకాలు అగమ్య గోచారంగా మారాయని అన్నారు. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన పాలకులు నిరుద్యోగుల పట్ల తీవ్ర వివక్షను ప్రదర్శించారని అన్నారు. నిరుద్యోగులే ప్రస్తుత కాంగ్రెస్ ను గెలిపించగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సైతం నిరుద్యోగులకు మొండి చూపిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పట్టభద్రుడైన నిరుద్యోగుల సమస్యలను చట్టసభల్లో చర్చించాలని లక్ష్యంతో తాను ఎమ్మెల్సీ బరిలో దిగినట్లు చెప్పారు. మూడు జిల్లాలకు చెందిన పట్టణంలో తనను ఆశీర్వదిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడి ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు.
నిరుద్యోగుల గొంతుకనౌతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రం అభ్యర్థిగా బరిలో ఉన్న అశోక్
- Advertisement -
- Advertisement -