Saturday, January 18, 2025

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన సుధీర్ బాబు హరోం హర’ పవర్ ఫుల్ ట్రైలర్

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, సుమంత్ జి నాయుడు, ఎస్‌ఎస్‌సి ‘హరోం హర’ పవర్ ఫుల్ ట్రైలర్
-హరోం హర ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. సుధీర్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి
-హరోం హర ట్రైలర్ టెర్రిఫిక్ గా అనిపించింది. జూన్ 14 నుంచి దినామూ దీపావళిలానే కలెక్షన్స్ వుండాలని కోరుకుంటున్నాను: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సంపత్ నంది
-ఇండియన్ సినిమాలో ‘హరోం హర’ లాంటి బ్యాక్ డ్రాప్ వున్న సినిమా రాలేదు. తప్పకుండా సినిమా యునానిమస్ గా హిట్ అవుతుంది: హీరో సుధీర్ బాబు
విభిన్న కథలని ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటున్న హీరో సుధీర్ బాబు తన అప్ కమింగ్ మూవీ ‘హరోం హర’లో మరొక కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన మేకర్స్, సూపర్ స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ ని లాంచ్ చేశారు.
ట్రైలర్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. హరోం హర స్క్రీన్ పైకి ఏం తీసుకువస్తుందో చూడాలని ఎదురు చూస్తున్నాను! ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది! సుధీర్‌బాబు అండ్ టీమ్ కు శుభాకాంక్షలు’ తెలియజేశారు.
బ్లాక్ బస్టర్స్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, సంపత్ నంది ముఖ్య అతిధులుగా హాజరైన ట్రైలర్ లాంచ్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ఆయుధాల ప్రాముఖ్యత గురించి సునీల్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989 నాటి కథ ఇది. జీవితంలో ఎలాంటి పురోగతి లేని, సంతృప్తి చెందని సుబ్రహ్మణ్యంకు ఒక సువర్ణావకాశం లభిస్తుంది. గన్స్ దొరకనప్పుడు అతను గన్ స్మిత్ అవుతాడు. సిటీలో హింసాత్మక ఘటనలు పెరగడంతో పోలీసులు గన్ స్మిత్ వెంట పడతారు.
ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు అద్భుతంగా వుంది. జ్ఞానసాగర్ ద్వారక యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. గన్ మేకింగ్ కాన్సెప్ట్ టాలీవుడ్ కి కొత్త. ఆయన రైటింగ్ ఎంత గొప్పదో ఆయన దర్శకత్వం కూడా అంతే అద్భుతంగా వుంది. డైలాగ్స్ కూడా పవర్ ఫుల్ గా ఉన్నాయి. సుధీర్ బాబు తన పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. కుప్పం యాసలో, డైలాగ్ డెలివరీ, పవర్ ఫుల్  స్క్రీన్ ప్రెజెన్స్ బిగ్గెస్ట్ అసెట్స్. సునీల్‌కు మంచి పాత్ర లభించింది. అతని ప్రజెన్స్ గ్రేట్ వాల్యు ని యాడ్ చేసింది.  సుధీర్ బాబుకు జోడిగా మాళవిక శర్మ తన పాత్రను చక్కగా పోషించింది.
టెక్నికల్‌గా సినిమా చాలా బ్రిలియంట్ గా వుంది. అరవింద్ విశ్వనాథన్ క్యాప్చర్ చేసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ తన ఎక్స్ ట్రార్డినరీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎలివేషన్స్ ఇచ్చాడు. SSC బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్-క్లాస్ లో వున్నాయి. టీజర్, పాటలు, ఇతర ప్రమోషన్‌లు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పగా, ట్రైలర్ అంచనాలని రెట్టింపు చేసింది. ఈ చిత్రానికి  రవితేజ గిరిజాల ఎడిటర్. భారీ అంచనాలతో జూన్ 14న హరోం హర ప్రేక్షకుల ముందుకు రానుంది.
గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర బ్యానర్, ఇందులో హీరో పాత్ర పేరు సుబ్రహ్మణ్యం, హరోం హర.. స్వామి వారిని కొలిచే పదం.. అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ ఆశీస్సులతో సినిమా పెద్ద హిట్ కావాలి. సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి (మే 31). ఆయన్ని స్మరించుకుంటూ, మహేష్ గారి అభిమానులు, ప్రేక్షకులు.. సుధీర్ బాబు గారి సినిమా చూసి మంచి విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను.  హరోం హర ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. చాలా కాన్ఫిడెంట్ గా అనిపించింది.  జూన్ 14న ప్రేక్షకులు థియేటర్స్ లోకి తొంగి చూడాల్సిన సినిమా ఇది. రాయలసీమ యాస చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు. ఈ క్రెడిట్ దర్శకుడికి దక్కుతుంది. చాలా పాషన్ వున్న దర్శకుడు. షాట్స్, విజువల్స్ చాలా అద్భుతంగా వున్నాయి. తనకి చాలా భవిష్యత్ వుంది. మాళవిక నటనకు ఆస్కారం వుండే పాత్ర చేశారు. చేతన్ నేపధ్య సంగీతం చాలా వుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సుధీర్ బాబు టాలీవుడ్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో. తన కెరీర్ లో సమ్మోహనం పెద్ద హిట్. ఈ సినిమా అదే రోజున విడులౌతుంది. ఈ సినిమాకి తనకి మంచి కమ్ బ్యాక్ హిట్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నాను. సుధీర్ బాబు రాంబోలా ఉంటాడు. ఇందులో జేమ్స్ బాండ్ ఇన్ కుప్పం అని చెప్పడం చాలా ఆసక్తికరంగా వుంది. ఈ సినిమా సుధీర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.
డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత టెర్రిఫిక్ గా అనిపించింది. జ్ఞాన సాగర్ ని చూస్తుంటే తెలుగు వెట్రిమారన్ ని చూస్తున్నట్లుగా వుంది. విజువల్స్ అంత బావున్నాయి. టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా వుంది. ఇందులో దినామూ దీపావలే అనే మాట వుంది. జూన్ 14 నుంచి దినామూ దీపావళిలానే  కలెక్షన్స్ వుండాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. కృష్ణగారి జయంతి సందర్భంగా ట్రైలర్ లాంచ్ కావడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా చాలా స్పెషల్. యాక్షన్ సినిమా చేయమని కృష్ణ గారు చాలా సార్లు చెబుతుండేవారు. ఈ సినిమా విషయంలో ఆయన చాలా ఆనందపడతారని నమ్ముతున్నాను. ఈ వేడుకు వచ్చి మాకు సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడిగారికి, సంపత్ నందిగారికి, దాముగారికి, వేణు గోపాల్ గారికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తెలుగు, ఇండియన్ సినిమాలో హరోం హర లాంటి బ్యాక్ డ్రాప్  వున్న సినిమా రాలేదని అనుకుంటున్నాను. ఇందులో సుబ్రహ్మణ్యం గన్ స్మిత్. ఇలాంటి క్యారెక్టర్ తో ఏ సినిమా రాలేదు. క్యారెక్టర్ పెరిగేకొద్ది రకరకాల గన్స్, ల్యాండ్ మైన్స్, రాకెట్ లాంచర్స్.. ఇలా చాలా చాలా తయారు చేస్తాడు. సింగిల్ లైన్ లో చెప్పాలంటే జేమ్స్ బాండ్ ఇన్ కుప్పం. లేదా రాంబో ఇన్ కుప్పం అనొచ్చు. మన పక్కింటి కుర్రాడికి గన్ తయారుచేసే నాలెడ్జ్ వుంటే అతను ఎలా తయారు చేస్తాడనే తరహలో చాలా ఆసక్తికరంగా వుంటుంది. మ్యూజిక్, డైలాగ్స్ కి మ్యాచ్ అయ్యేలానే వెపన్స్ వుంటాయి. గన్స్ కోసం సాగర్ టీం చాలా లోతుగా పరిశోధించారు. గన్ మేకింగ్ ని చాలా సహజసిద్ధంగా ఇందులో చూపించాం. మేకింగ్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నాం. యాక్షన్ సీక్వెన్స్ లో టాప్ క్లాస్ లో వుంటాయి. క్లైమాక్స్ ఫైట్స్ లో రెండు వేల మంది సెట్స్ లో వుంటారు. కాన్సెప్ట్ చాలా యూనిక్ గా చేసాం. నిర్మాతలు సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. సాగర్ సినిమా కోసం ప్రత్యేకమైన వరల్డ్ ని క్రియేట్ చేశాడు. ఇది న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. చేతన్ చాలా అద్భతమైన మ్యూజిక్ చేశాడు. టీం అంతా చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. సమ్మోహనం విడుదల డేట్ కి విడుదలౌతుంది. తప్పకుండా సినిమా యునానిమస్ గా హిట్ అవుతుందని భావిస్తున్నాను. ఇది థియేట్రికల్ ఫిల్మ్. జూన్ 14న అందరూ తప్పకుండా థియేటర్స్ లోనే చూడండి’అన్నారు.
చిత్ర దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ.. ఈ వేడుకు విచ్చేసిన అనిల్ రావిపూడిగారికి, సంపత్ నందిగారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. హరోం హర చాలా ఇష్టంగా రాసుకొని ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా. నిర్మాతలు సుమంత్, సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. చాలా సపోర్ట్ చేశారు. నా డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం అందరికీ ధన్యవాదాలు. చైతు మ్యూజిక్ లో విశ్వరూపం చూపించాడు. నేపధ్యంలో కూడా ఇందులో చాల మంచి పాటలు వస్తాయి. సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. మాళవిక చాలా కొత్తగా కనిపిస్తారు. నా దళపతి.. సుధీర్ బాబు గారు. ఆయన సపోర్ట్ మర్చిపోలేను. జూన్ 14న సుధీర్ బాబు గారి మాస్ సంభవం చూడబోతున్నారు. ఇందులో రెండు వేల మందితో షూట్ చేసిన ఒక సీక్వెన్స్ వుంది. అది థియేటర్స్ లో అద్భుతంగా వుంటుంది. ఈ సినిమా బిగినింగ్ లో సుధీర్ బాబు అనే టైటిల్ వస్తుంది. సినిమా పూర్తయిన తర్వాత మరో టైటిల్ వస్తుంది. అది సుధీర్ బాబు గారికి యాప్ట్ టైటిల్ అనిపించింది. ఆ టైటిల్ ఎందుకు ఇచ్చానో మీకు అర్ధమౌతుంది. అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.
హీరోయిన్ మాళవిక శర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు.ఇలాంటి మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడు నాపై ఉంచిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ ప్రొడక్షన్ టీంతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. సుధీర్ బాబు గారు చాలా సపోర్ట్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.  ఈ వేడుకు విచ్చేసిన అనిల్ రావిపూడిగారికి, సంపత్ నందిగారికి, దాము గారికి, సుధీర్ బాబు గారి అభిమానులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.
కె ఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం ఐదేళ్ళుగా పరిచయం. చాలా పాషన్ తో సినిమాల్లోకి వచ్చారు. చాలా పాషన్ తో సినిమాని నిర్మించారు. సుమంత్ కూడా జాయిన్ కావడం ఆనందంగా వుంది.  సుధీర్ చాలా క్రమశిక్షణ గల ఆర్టిస్ట్. అలాగే అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ నా అభిప్రాయం. ఈ సినిమాతో తనకి చాలా మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం చాలా పాషన్ వున్న నిర్మాత. చాలా భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేశారు. ఈ సినిమా చూశాను. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులని సరికొత్తగా అలరిస్తుంది. చాలా పెద్ద హిట్ అవుతుంది. జ్ఞాన సాగర్ చాలా సర్ ప్రైజ్ చేశాడు. సుధీర్ బాబు గారికి ఇది పర్ఫెక్ట్ మాస్ సినిమా. ఇది ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ..సినిమాకి మ్యూజిక్ చాలా ముఖ్యం. నన్ను నమ్మి ఆ భాద్యత నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడు చాలా గొప్ప విజన్ తో ఈ సినిమా చేశాడు. చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను. ఈ సినిమా ప్రతి కంటెంట్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదల కోసం టీం అంతా ఆసక్తిగా ఎదురుచుస్తున్నాం’ అన్నారు.
నిర్మాత సుమంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులందరికీ ధన్యవాదాలు. చేతన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో మ్యూజిక్ మరో స్థాయిలో వుంటుంది. ఈ సినిమా కోసం రెండేళ్ళు పాటు చాలా హార్డ్ వర్క్ చేశారు సుధీర్ బాబు గారు. ఈ సినిమా చూసిన తర్వాత బిఫోర్ హరోం హర, ఆఫ్టర్ హరోం హర అంటారు. ఖచ్చితంగా సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్