హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్ లో ఈ నెల 24 న జాబ్ మేళా
పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతా హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర యువజన సర్వీస్ శాఖ పక్షాన ఈనెల 24న ఉదయం 10 గంటలకు సున్నా, నుండి పీజీ వరకు చదివిన వారందరికీ ఉద్యోగాలు కల్పించడానికి జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
ఈ జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు 5000 ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించబడతాయి. సున్నా నుండి పిజి వరకు చదువుకున్న ప్రతి ఒక్కరు యువత ఈ జాబ్ మేళాను ఉపయోగించుకోవాలి.హుస్నాబాద్ ప్రజలందరికీ కోరుతున్నా నేను యువజన విద్యార్థి నాయకునిగా వచ్చిన తర్వాత విద్యార్థి, ఉద్యోగ అవకాశాలు కు సంబంధించి, వ్యవసాయ విద్యా ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నుండి నిరుద్యోగ యువత తరలి రావాలి.జాబ్ మేళాలో ఉద్యోగం రాకుండా బయట దేశాల్లో విదేశీ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి.అక్కడ మంచి జీతాలు ఉన్న ఉద్యోగాలు కూడా వస్తాయి.యువజన శాఖ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో అందరూ పాల్గొనాలి.హుస్నాబాద్ లోని తిరుమల గార్డెన్స్ లో ఉదయం 10:00 గంటల నుండి ఈ జాబ్ మేళా కార్యక్రమం జరుగును.