రహదారుల నిర్మాణానికి నిధులు 

- Advertisement -

Funding for road construction : రహదారుల నిర్మాణానికి నిధులు 
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
చందుర్తిలో సిమెంట్ రహదారుల ప్రారంభోత్సవం
రాజన్న సిరిసిల్ల
రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులురూ. 30 లక్షల 50  వేలతో చందుర్తిలో
అంతర్గత సిమెంట్ రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మంగళవారం రాగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ స్వాగతం పలికారు.అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని వివరించారు. ఇక్కడ వేములవాడ  ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, పంచాయతీ రాజ్ శాఖ ఈ ఈ సూర్య ప్రకాష్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ప్రదీప్, ప్రజా ప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular