- Advertisement -
పటాన్ చెరు లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి
Hydra Commissioner Ranganath Sudagali in Patancheru
సంగారెడ్డి
పటాన్ చెరులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేసారు. పటాన్ చెరులోని సాకి చేరువుని అయన పరిశీలించారు. సాకి చెరువు కబ్జాకు గురికావడంతో పరిశీలించారు. ఇప్పటికే చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సాకి చెరువు ఎఫ్టిఎల్ విస్తీర్ణం 135 ఎకరాలు కాగా పదుల ఎకరాల్లో చెరువు కబ్జాకి గురైనట్టు అనుమానం. చెరువుని ఆనుకునే తూములు బంద్ చేసి ఇన్ కోర్ సంస్థ అపార్ట్ మెంట్ కట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.ఇన్ కోర్ సంస్థ నిర్మించిన అపార్ట్ మెంట్ లను రంగనాథ్ పరిశీలించారు
- Advertisement -



