పండుగ వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలి
Vinayaka Navratri celebrations should be held in a festive atmosphere
అదనపు కలెక్టర్ పి. రాంబాబు
జగిత్యాల,
పండుగ వాతావరణంలో శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని అదనపు కలెక్టర్ పి. రాంబాబు తెలిపారు.
శుక్రవారం గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశ్వ హిందు పరిషత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. రాంబాబు మాట్లాడుతూ గణపతి మండపాల వద్ద ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించాలని,విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేసినప్పుడు పాత వైర్లను ఉపయోగిస్తే షాట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉన్నందున కొత్త వైర్లను ఉపయోగించాలని, లూజ్ కనెక్షన్ ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వైర్లను ఎక్కడి నుండి కనెక్ట్ చేసుకున్నారు అనేది చాలా ముఖ్యమని సూచించారు. దీనిపై మండపాల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి డి.జె సౌండ్లకు అనుమతి లేదని వివరించారు. అలాగే ఆసుపత్రుల వద్ద కానీ, పాఠశాలల దగ్గర కానీ గణేష్ మండపాలు ఏర్పాటు చేసి వారికి ఇబ్బంది కలిగించ కూడదని తెలిపారు. ఈ నెల 16, 17 రెండు రోజులు నిమజ్జనం ఉన్నందున శాంతియుతంగా జరుగుటకు సహకరించాలని కోరారు. అలాగే ఎటువంటి అవాంతరాలకు తావులేకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చ గొట్టే విధంగా వాట్సాప్ ఫేక్ సందేశాలు పంపిస్తుంటారని వాటిని 1930 కి ఫోన్ చేసి తెలిపినచో అటువంటివి తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 24 గంటలు పోలీసులు అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. నిమజ్జనంలో జెండాలను ఉపయోగించడానికి కర్రలకి బదులుగా ప్లాస్టిక్ పైపులు వాడాలని సూచించారు. ఫ్లెక్సీలు రోడ్డుకి అడ్డంగా ఉండకూడదని, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా కంటెంట్ ఉండరాదని, రూల్స్ పాటించాలని రూల్స్ ఆతిక్రమించి నట్లైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆనంతరం డిఎస్పీ రఘు చందర్ మాట్లాడుతూ మెట్ పల్లిలో 16 వ తేదీన నిమజ్జనం ఉంటుందని, చావడి దగ్గర అన్ని విగ్రహాలు వచ్చిన తర్వాత అక్కడి నుండి వట్టి వాగుకు వెళ్తాయని, రోడ్లపై చెట్ల కొమ్మలను క్లియర్ చేయడం జరిగిందని, రోడ్లపై గుంతలను పూడ్చుటకు ఇప్పటికే అధికారులతో మాట్లాడమని తెలిపారు. అలాగే కేవలం రోడ్ల మీద విద్యుత్ వైర్లు మాత్రమే కాకుండా డిష్, వైఫై నెట్ వర్క్ కు సంబంధించిన వైర్లు కూడా ఉన్నాయని మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని అన్నింటిని క్లియర్ చేయించి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూడాలని కోరారు.ఈ సంధర్భంగా
కోరుట్ల డిఎస్పీ ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ కోరుట్లలో 17 వ తేదీన నిమజ్జనం ఉంటుందని, అక్కడ కాలేజి గ్రౌండ్ లో మొదలుకొని మెయిన్ రోడ్డు మీదుగా కోరుట్ల వాగులో నిమజ్జనం జరుగుతుందని,3 క్రేన్ల్ సహాయంతో ఎటువంటి ఆటంకం లేకుండా నిమజ్జనం నిర్వహిస్తామని తెలిపారు.
అనంతరం కలెక్టరేట్ లో మట్టి గణపతి విగ్రహాలను విశ్వ హిందు పరిషత్ సభ్యులకు, అధికారులకు, సిబ్బందికి అదనపు కలెక్టర్ పి.. రాంబాబు అందజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల, మెట్ పల్లి ఆర్డీఓలు మధు సుధన్, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ.ఓ హనుమంత రావు, డిఎస్పీలు రఘు చందర్, ఉమా మహేశ్వర రావు, విశ్వ హిందు పరిషత్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



