గణేష్ నవరాత్రులు ప్రశాంత నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం

- Advertisement -

గణేష్ నవరాత్రులు ప్రశాంత నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం

Ganesh Navratri using technology to celebrate peacefully

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లాలో సుమారు 2,791 గణేష్ విగ్రహాలు  మండపాలన్ని జియో ట్యాగ్ పెట్రోలింగ్ తో పోలీసుల నిరంతర పర్యవేక్షణ
జగిత్యాల,
వినాయక నవరాత్రుల,మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో పండుగలు జరిగేలా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని జగిత్యాల జిల్లా
ఎస్పీ ఆశోక్ కుమార్ తెలిపారు.  వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.గణేష్ మండపాల అనుమతులను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే సూచించిన జిల్లా పోలీసులు అందుకు అనుగుణంగా ప్రతి మండపం యొక్క సమగ్ర సమాచారాన్ని ఒక్క క్లిక్ తో అందుబాటులోకి తీసుకువచ్చేలా పరిజ్ఞానాన్ని వాడుతోంది…. జిల్లా వ్యాప్తంగా 2,791  వరకు ఈ సంవత్సరం వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. వీటన్నింటికి ఇప్పటికే జియో ట్యాగ్ చేయటం జరిగిందని ఎస్పీ తెలిపారు. జియో ట్యాగ్ చేసిన మండపాలను క్లిక్ చేస్తే మండపానికి సంబందించిన పూర్తి వివరాలు అందులో కనిపించేలా చర్యలు చేపట్టారు అంతే కాదు ఆ మండపం వద్దకు ఎలా వెళ్లాలి, ఏదైనా జరిగినప్పుడు త్వరగా ఆ ప్రాంతానికి చేరుకోవాలి అనేది సైతం మ్యాప్ తో సహా కనిపించే విధంగా గూగుల్ మ్యాప్ తో యాప్ ను అనుసంధానించారు . ఏ మండపం వద్దనైనా ఘర్షణ జరిగినట్లుగా సమాచారం వస్తే ఆ మండపం అడ్రస్ వెతకావాల్సిన అవసరం లేకుండా జియో ట్యాగింగ్ ద్వారా కేవలం 5 నుండి 10 నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
పెట్రోలింగ్ వాహనాలతో నిరంతర పర్యవేక్షణ
జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ల పెట్రోలింగ్ వాహనాలు,బ్లూ కోట్స్ వాహనాలతో రాత్రి, పగలు గణేష్ మండపాలతో పాటు అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ తెలిపారు. . జిల్లాలో నవరాత్రుల సందర్బంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రతి మండపం వద్ద విధిగా సిసి కెమెరాలు అమర్చుకునే విధంగా మండపాల నిర్వాహకులలో అవగాహన కల్పించామని అన్నారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, గణేష్ నవరాత్రులు, నిమజ్జనం నిర్వహించుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారం లాంటి సమాచారాన్ని బాధ్యత కలిగిన పౌరులుగా పోలీసులకు తెలియపర్చాలని ఎస్పీ   కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular