Sunday, December 22, 2024

జిల్లాల్లో ఆ ఇద్దరే…..

- Advertisement -

జిల్లాల్లో ఆ ఇద్దరే…..

Those two in the districts

విజయవాడ, సెప్టెంబర్ 11, (న్యూస్ పల్స్)
విప‌క్షం వైసీపీపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు.. కీల‌క వ‌ర‌ద‌ల స‌మ‌యంలో త‌మ‌ను తాము డిఫెన్స్ చేసుకునేం దుకు.. వైసీపీ త‌ర‌ఫున కేవ‌లం ఇద్ద‌రంటే ఇద్ద‌రు నాయ‌కులు మాత్ర‌మే మాట్లాడుతున్నారు. వారిద్ద‌రూ మాజీ మంత్రులే. ఒక‌రు పేర్ని నాని, మ‌రొకరు అంబ‌టి రాంబాబు. వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన వారు ఎవ‌రూ కూడా మీడియా ముందుకు రావ‌డం లేదు. డిఫెన్స్ కూడా చేసుకోవ‌డం లేదు. ఎవ‌రికి వారు మౌనంగానే ఉండిపోతున్నారు. మ‌రి దీని వెనుక రీజనేంటి? అనేది ఆస‌క్తిగా మారింది.వాస్త‌వానికి వైసీపీకి విజ‌య‌వాడ‌లోనే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు, మ‌ల్లాది విష్ణు వంటివారు ఉన్నారు. కీల‌క‌మైన వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వారు మాట్లాడొచ్చు. కానీ, వారిద్ద‌రూ ఎక్క‌డా క‌నిపించ డం లేదు. ఇక‌, మిగిలిన నాయ‌కులు రోజా, కొడాలి నాని.. వంటివారు కూడా మౌనంగానే ఉండిపోతున్నారు. పోనీ. ప‌రిస్థితి ప్ర‌శాంతంగా ఉందా? అంటే.. అదీ లేదు. అధికార పార్టీ నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ స‌మ‌యంలో వారు ఏం చేస్తున్నార‌నేది ప్ర‌శ్న‌.తాజాగా వైసీపీ అంత‌ర్గ‌త స‌మాచారం ప్ర‌కారం.. మాజీ సీఎం జ‌గ‌న్ అంద‌రికీ ఫ్రీహ్యాండ్ ఇచ్చార‌ని తెలిసింది. అంటే అంద‌రూ మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌స్తుత ప‌రిస్థితిపై వ్యాఖ్యానించాల‌ని.. పార్టీకి ఎదుర వుతున్న ఇబ్బందులు త‌గ్గించాల‌ని కూడా పేర్కొన్నార‌ట‌. కానీ, కేవ‌లం అంబ‌టి, నానిలు మాత్ర‌మే మీడియా ముందుకు వ‌స్తున్నారు. మిగిలిన వారు మాత్రం త‌మ‌పై ఉన్న కేసులు.. లేదా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన కూట‌మి కేడ‌ర్ కార‌ణం.. వెన‌క్కి త‌గ్గుతున్నార‌ని తెలుస్తోంది.అంటే ఒక ర‌కంగా నాయ‌కులు భ‌య‌ప‌డుతున్నార‌నేది వాస్త‌వం. ఇప్ప‌టికే త‌మ‌పై కేసులు ఉన్న నేప థ్యంలో తాము ఇప్పుడు నోరు తెరిస్తే.. ఏదో ఒక కేసు పెట్టి ఇబ్బందులు పెట్టే అవ‌కాశం ఉంటుంద‌ని ఒక‌వైపు ఆలోచ‌న‌గా ఉంటే.. మ‌రోవైపు నాయ‌కుల‌కు ఏం జ‌రిగినా.. పార్టీ అధిష్టానం సైలెంట్‌గా ఉంటున్న విష‌యాన్ని కూడా నాయ‌కులు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కెందుకు బుర‌ద అంటించుకోవ‌డం అనే ధోర‌ణిలోనే నాయ‌కులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ కార‌ణంగానే వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్