విజయవాడ వరద బాధితుల ఆర్థిక సహాయార్థం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో విరాళాల సేకరణ
Donations by youth organizations for financial assistance Vijayawada flood victims
దయార్థ హృదయంతో చలించి ఆర్థికచేయుత అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ఉద్యమాలే కాదు సమాజ సేవలోనూ ముందుంటామని విద్యార్థి, యువజన సంఘాల నేతల పిలుపు.
ఉదయం
విజయవాడ వరద బాధితుల ఆర్థిక సహాయం నిమిత్తం విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు రాజశేఖర్, కృష్ణ, ఏఐఎస్ఎఫ్ మండల మండల అధ్యక్ష, కార్యదర్శులు మధు, భాస్కర్ లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ… గత కొన్ని రోజుల క్రితం అధిక వర్షాల కారణంగా విజయవాడ నగరంలో ముంచేత్తిన వరదల నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ప్రజానీకానికి ఆర్థిక చేయూత అందించేందుకు సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో దేవనకొండ పట్టణంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నిత్యం విద్యార్థి, యువజన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టడమే కాకుండా సమాజ సేవలోనూ ముందుంటామని వరద బాధితులకు అండగా తమ వంతు బాధ్యతగా దాతల సహాయంతో సేకరించిన నిధులతో కొంతమేరకైనా వరద బాధితులకు ఉపశమనంగా ఉంటుందని వారు తెలిపారు. విజయవాడ నగరంలో సంభవించిన ఆర్థిక నష్టం అంచనా వేయలేనంత తీవ్రంగా ఉండడం వలన సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు దయార్ధ హృదయంతో మంచి మనసుతో ఆలోచించి వరద బాధితులకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో వివిధ వర్గాల ప్రజల నుండి సేకరించిన విరాళాల మొత్తం:-11,209 సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గిడ్డయ్య, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే జగన్నాథం లకు సీపీఐ మండల కార్యదర్శి ఎం. నరసారావు, సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నిధులను సిపిఐ రాష్ట్ర సమితి తరపున “ఏపీ సీఎం సహాయ నిధికి” పంపనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రామాంజనేయులు, ప్రజాసంఘాల నాయకులు వీరాంజనేయులు, శ్రీనివాసులు, రవి, రామంజి, నాగరాజు, నరేష్, సురేంద్ర, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



