లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాల

- Advertisement -

లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాల

Financial assistance of one lakh rupees should be provided

ఖమ్మం
వరద బాధితులకు కనీసం లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని సిపిఐ ఎంఎల్  మాస్ లైన్ సెంట్రల్ కమిటీ మెంబర్ కెచ్చల రంగారెడ్డి డిమాండ్ చేశారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ర్ట కమిటీ సభ్యులు పర్యటించారు. మంచికంటి నగర్, బొక్కల గడ్డ, రాజీవ్ గృహ కల్ప ప్రాంతాల్లో పర్యటించారు. మున్నేరు వరద ప్రభావిత బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అందిన సహాయం పై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తామన్న నగదు అందిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా వరదలతో జిల్లా తీవ్రంగా నష్టపోయినదని అన్నారు. వరద బాధితులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సీనియర్ నాయకులు చిన్న చంద్రన్న, పార్టీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు, ఆవుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular