- Advertisement -
జగన్తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్కు తాఖీదు
Warning to the female constable who took a selfie with Jaganఅమరావతి
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సెల్పీ దిగిన మహిళా కానిస్టుబుల్ కు అధికారులు మెమో జారీ చేసారు. గుంటూరు జైలులో వున్న మాజీ ఎంపి నందిగం సురేష్ ను వైఎస్ జగన్ ఇటీవల పరామర్శించారు. జైలు బయటకు వచ్చిన జగన్ను అదే జైలులో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషాబాను కుమార్తెతో కలిసి వచ్చి జగన్తో సెల్ఫీలు దిగారు. సదరు ఫొటో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. మెమో కు ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలుంటాయని జైలర్ రవిబాబు అన్నారు. విధుల్లో ఉన్న సంగతిని మర్చిపోయి ఇలా సెల్ఫీలు దిగడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
- Advertisement -




