విద్య రంగానికి కొండేల మారుతి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి
Kondela Maruti's services to the education sector are priceless-కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషన్ ఓజా
-మంత్రపురి విద్యా శ్రేష్ట మహోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
మంథని
మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల మండలి అధ్యక్షుడు కొండేల మారుతి విద్యారంగానికి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషన్ ఓజా అన్నారు.
శుక్రవారం మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో మంథని విద్యార్థి యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంత్రపురి విద్యా శ్రేష్ట మహోత్సవం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషన్ ఓజా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతి విద్యారంగానికి చేస్తున్న కృషిని ఇదేవిధంగా కొనసాగిస్తూ మంథని నియోజక వర్గం లోపల విద్యాసంస్థలను బలో పేతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమ వ్యవహార్త మంథని విద్యార్థి యువత అధ్యక్షుడు శ్రీ కొండల మారుతి మాట్లాడుతూ మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంలో నాతోపాటు కృషి చేసిన పెద్దలందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని కళాశాలలో గల అధ్యాపకులు అందరినీ ప్రశంసా పత్రము, శాలువాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల సీపీడీసీ సెక్రటరీ మాదాడి ప్రభాకర్ రెడ్డి, అతిథులుగా విచ్చేసిన రాధాకృష్ణయ్య ,నరసింహ చారి, ఐక్యుఏసి కోఆర్డినేటర్ కృష్ణ ,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ, చరిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్, అధ్యాపకులు అమర్నాథ్, ముకుందము, మానస, రజిత, బోధ నేతర సిబ్బంది అశోక్, సుధాకర్, ముజాహిద్, రాజు, దుర్గారాజు ,సురేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




